హైదరాబాద్ ను వీడని కరోనా మహమ్మారి... శనివారం ఒక్కరోజే 52 పాజిటివ్ కేసులు

By Arun Kumar PFirst Published May 23, 2020, 9:47 PM IST
Highlights

 తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే  వుంది. శనివారం ఒక్కరోజే ఏకంగా 52 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

హైదరాబాద్:  తెలంగాణతో కరోనా మహమ్మారి విజృంభణ  కొనసాగుతూనే వుంది. కొద్దిరోజుల క్రితం రాష్ట్రంలో సింగిల్ డిజిట్  కే పరిమితమైన కేసులు లాక్ డౌన్ సడలింపుల తర్వాత మళ్లీ పెరగడం ప్రారంభించాయి. ఇలా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే వుంది. ఇవాళ(శనివారం) ఒక్కరోజే  రాష్ట్రవ్యాప్తంగా 52 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇందులో అత్యధికం రాజధాని హైదరాబాద్ లోనే బయటపడ్డాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,813కు చేరింది. ఇవాళ ఒకరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 49కి చేరింది. శనివారం 25మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ కావడంతో 1,068 మంది కోలుకున్నట్లయ్యింది.

తెలంగాణలో ప్రస్తుతం 696 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ జీహెచ్ఎంసీ పరిధిలో 33,19మంది వలస కూలీలకు పాజిటివ్‌గా తేలిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.  

read more   తెలంగాణలో కరోనా టెస్టులూ తక్కువే... కేసులూ తక్కువే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

 కాగా వలస కూలీల కోసం ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకొందో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు.వలస కార్మికుల సమస్యలపై తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ వసుధ నాగరాజు  లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

వలస కార్మికులను ఆదిలాబాద్ సరిహద్దు దాటించి  వదిలేస్తున్నారని పిటిషనర్ చెప్పారు. మేడ్చల్ రహదారిపై వందలాది మంది కూలీలు రోడ్డుపై నడుచుకొంటూ వెళ్తున్నారని ఆయన హైకోర్టు  దృష్టికి తీసుకొచ్చారు.

 వలస కూలీలను సరిహద్దులు దాటించి చేతులు దులుపుకోవద్దని  హైకోర్టు సూచించింది. వలస కూలీలను ఆదుకొనేందుకు ప్రభుత్వం తీసుకొన్న చర్యల గురించి ఈ నెల 29వ  తేదీ లోపుగా చెప్పాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

వలస కూలీలను  గుర్తించి ఫంక్షన్లలో ఉంచి వారికి భోజన వసతి కల్పించాలని హైకోర్టు ఆదేశించింది. కార్మికులు రైళ్లు ఎక్కే వరకు ప్రభుత్వమే భోజనం పెట్టాలని కోరింది.  వలస కార్మికులకు అవసరమయ్యే వైద్య సేవలను కూడ కల్పించాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

click me!