ఎంసెట్ సహా తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇదీ...

By telugu teamFirst Published May 23, 2020, 5:17 PM IST
Highlights

తెలంగాణ ప్రభుత్వం క్రమంగా సాధారణ పరిస్థితులను నెలకొల్పడానికి ప్రయత్నిస్తోంది. ఈ విద్యా సంవత్సరం ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

హైదరాబాద్: తెలంగాణలో విద్యా కార్యక్రమాలు క్రమంగా ప్రారంభమవుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించి విద్యా సంస్థలను మూసేశారు. ఈ ఏడాది విద్యా కార్యక్రమాలు క్రమంగా ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తోంది. 

తాజాగా పదో తరగతి  పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా శనివారం ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను విడుదలు చేసింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యాశాఖ అధికారులతో సమావేశమై ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ను విడుదల చేశారు. ప్రవేశ పరీక్షలను అన్నింటినీ జులైలో నిర్వహించాలని నిర్మయించారు. షెడ్యూల్ ఈ విధంగా ఉంది. 

ఎంసెట్ - జులై 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 
ఈసెట్ - జూలై 4వ తేదీ
లాసెట్ -  జులై 10వ తేదీ
ఐసెట్ - జూలే 13వ తేదీ
ఎడ్ సెట్ - జులై 15వ తేదీ

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సామాజిక దూరం పాటిస్తూ విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన పరిస్థితి రావచ్చు. పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆ నిర్ణయమే తీసుకుంది. జలుబు, దగ్గు వంటి లక్షణాలు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తారు. ప్రవేశ పరీక్షలు కూడా ఆ విధంగా జరుగుతాయని భావిస్తున్నారు. జూన్, జూలై నెలల్లో విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అర్థమవుతోంది.

click me!