సోమ, బుధవారాల్లో భారీ వర్షాలు... హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక

Arun Kumar P   | Asianet News
Published : Jul 19, 2021, 05:15 PM IST
సోమ, బుధవారాల్లో భారీ వర్షాలు... హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిక

సారాంశం

తెలంగాణలో ఇవాళ, ఎల్లుండి(సోమ, బుధవారం) భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

హైదరాబాద్: ఇవాళ(సోమవారం), ఎల్లుండి(బుధవారం) తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం వుందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అయితే రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అది కూడా ఒకటి రెండు ప్రదేశాల్లోనే భారీ వర్షాలు కురవనున్నాయని... మిగతా చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం వుందని వాతావరణ అధికారులు తెలిపారు. 

ఆదివారం సముద్ర మట్టంకి 0.9కి మీ ఎత్తున ఏర్పడిన  ఉత్తర, దక్షిణ ద్రోణి ఇవాళ బలహీనపడిందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తూర్పు- పశ్చిమ ద్రోణి(షేర్ జోన్) ఈ రోజు సుమారు 17°N అక్షాంశం వెంబడి స్థిరంగా ఉందని... సముద్ర మట్టానికి  4.5 కి మీ నుండి 5.8 కి మీ మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగుతుంది. దీని ప్రభావంతో జులై 23న  వాయువ్య బంగాళాఖాతంలో, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. 

read more  హైదరాబాద్‌లో భారీ వర్షాలు... పాత వీడియోలతో జనం హడల్, పుకారు రాయుళ్లకు సీపీ వార్నింగ్

 దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం వుందని తెలిపారు. అయితే ఇవాళ, ఎల్లుండి మాత్రం కొన్నిచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారులు వెల్లడించారు. మొత్తంగా రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి రెండు ప్రదేశాల్లో కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు ప్రకటించారు.
 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert : తెలంగాణపై చలి పంజా.. ఈ జిల్లాల్లో వచ్చే పదిరోజులు అత్యల్ప ఉష్ణోగ్రతలు
Medicover Hospitals: అరుదైన అకలేషియా కార్డియాకు POEM చికిత్స.. 61 ఏళ్ల మహిళకు కొత్త జీవితం !