నన్ను చంపేదుకు కుట్రలు...: ఈటల రాజేందర్ సంచలనం

Arun Kumar P   | Asianet News
Published : Jul 19, 2021, 04:49 PM ISTUpdated : Jul 19, 2021, 04:53 PM IST
నన్ను చంపేదుకు కుట్రలు...: ఈటల రాజేందర్ సంచలనం

సారాంశం

ప్రజా దీవెన యాత్ర పేరిట హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పాదయాత్ర చేపట్టిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన వ్యక్తిగత భద్రతపై సంచలన కామెంట్స్ చేశారు. 

కరీంనగర్: తనను చంపడానికి కుట్ర పన్నారని మాజీ మంత్రి, ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.  ఇందుకోసం ఓ మంత్రి హంతకుల ముఠాలతో చేతులు కలిపారని.... దీనిపై ఇప్పటికే తనకు సమాచారం వచ్చిందన్నారు ఈటల. 

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో ప్రజా దీవేన యాత్ర పేరిట సోమవారం ఉదయం పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా శనిగరం గ్రామానికి చేరుకున్న ఈటల అక్కడి ప్రజలను కలుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ సీఎం కేసిఆర్ రజాకార్లను తలపిస్తున్నాడని మండిపడ్డారు. 

read more  ఖబర్దార్... చిల్లర వేషాలు వేస్తే వదిలిపెట్టబోం...: కేసీఆర్ కు ఈటల వార్నింగ్ (వీడియో)

''అరె కొడుకుల్లారా ఖబర్దార్... నరహంతకుడు నయీం చంపుతా అని బెదిరిస్తేనే భయపడలేదు. మీ చిల్లర ప్రయత్నాలకు భయపడను. ఉగ్గుపాలతో ఉద్యమాలు చేసిన వాడిని. మీరు నాపై ఎన్ని కుట్రలు పన్నినా ఏం చేయలేరు'' అని హెచ్చరించారు. 

''నేను ఈటల మల్లయ్య కొడుకుని... ఆత్మగౌరవం కోసం ఏ స్థాయిలో అయినా కొట్లడతా. దుబ్బాక లో ఏం జరిగిందో అదే హుజురాబాద్ లో కూడా జరుగుతుంది. 2018లో నన్ను ఓడించడానికి కుట్రలు చేసినా నా ప్రజలు అండగా నిలిచారు... ఇప్పుడూ నిలుస్తారు'' అని ఈటల ధీమా వ్యక్తం చేశారు. 

''చట్టాల మీద నాకు విశ్వాసం ఉంది. కాబట్టి ఆ చట్టాలను కాపాడాల్సిన పోలీసులకు తాను సహకరిస్తున్నా...మీరు కూడా నాకు సహకరించండి'' అంటూ తన వ్యక్తిగత భద్రతపై, పాదయాత్రకు కల్పిస్తున్న భద్రతపై ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌కు దూరంగా అభివృద్ధికి ద‌గ్గ‌ర‌గా.. ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.