మధ్యాహ్నం ఒంటిగంటకు ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్? ఈడీ విచారణ లేనట్టేనా?

By SumaBala Bukka  |  First Published Mar 9, 2023, 8:06 AM IST

నేటి మధ్యాహ్నం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా ముందుకు రానున్నారు. దీంతో ఈడీ విచారణ వాయిదా పండిందా? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈడీ నుంచి దీనిమీద ఎలాంటి స్పష్టత లేదు. 


హైదరాబాద్ : నేడు కవిత విచారణకు హజరు కావాలని ఈడీ నోటీసులు అందిన నేపథ్యంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మార్చి 8వ తేదీన ఎమ్మెల్సీ కవితను గురువారం ఢిల్లీలో విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది. అయితే దీనిమీద కవిత నిరసన వ్యక్తం చేశారు. మార్చి 9న తనకు కుదరదని మార్చి 15న హాజరవుతానని మొదటి ఈడీకి ఉత్తరం రాశారు. అయితే.. దీనిమీద ఈడీ స్పందించకపోవడంతో.. రేపు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ధర్నా నేఫథ్యంలో అది అయిపోయిన తరువాత మార్చి 11న హాజరవుతానని ఈడీకి లేఖ రాశారు. 

ఈ క్రమంలోనే ఓ మహిళను తన ఇంట్లోనే విచారించాలన్న అంశాన్ని ఆమె గుర్తు చేశారు. వీడిమొ కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం ఉన్నా కార్యాలయానికి రావాలని ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు. మహిళగా తనకున్న చట్టపరమైన హక్కులను వినియోగించుకుంటానని అన్నారు. ఈ క్రమంలోనే నేడు ఈడీ విచారణకు కవిత హాజరు కావాల్సి ఉంది. కానీ తాను రానని లేఖ రాసినప్పటికీ.. కవిత గత రాత్రే ఢిల్లీకి చేరుకున్నారు. దీని మీద రాజకీయంగా పలు ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. 

Latest Videos

రేపు కేబినెట్ సమావేశం తర్వాత గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖరారు.. ఆ ఇద్దరూ ఎవరు, బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ

కాగా.. కవిత నేటి మధ్యాహ్నం ఢిల్లీలో మీడియా ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో.. ఈడీ విచారణ ఈ రోజు లేనట్టే అనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.అయితే, దీనిమీద ఈడీ నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం మాత్రం ఇంకా వెలువడలేదు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో కవిత కు ఈడీ నోటీసుల నేపథ్యంలో అరెస్ట్ చేస్తారా? అనే గుసగుసలు వినిసిప్తున్నాయి. ఈ క్రమంలో ఈ అంశం మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

ఈ రోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు కవిత ప్రకటించడంతో.. ఈడీ విచారణకు కవిత హాజరు కావడం లేదా? ఈడీనుంచి కవిత  ఈమెయిల్ కు రిప్లై వచ్చిందా? ఏం జరగబోతోంది అనే అంశం ఉత్కంఠగా మారింది. ఓ వైపు ఇప్పటివరకు ఈడీ నుంచి ఎలాంటి స్ఫష్టత రాలేదు. ఇంకోవైపు ఆమె విచారణ ఎల్లుండికి వాయిదా వేసినట్టుగా కవితకు సమాచారం వచ్చిన తరువాతే ప్రెస్  మీట్ పెడుతున్నట్లుగా అంటున్నారు. ఈ క్రమంలో అసలేం జరగబోతోంది. ఒంటిగంటకు ప్రెస్ మీట్ ఉంటుందా? కవిత ఈడీ విచారణకు హాజరవుతుందా? విచారణ తరువాత కవితను అదుపులోకి తీసుకుంటారన్న ఊహాగాానాలు నిజమవుతాయా? అనేది రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చలకు దారి తీస్తోంది. 

click me!