తెలంగాణ కరోనా అప్ డేట్: 24గంటల్లో లక్ష టెస్టులు...పాజిటివ్ కేసులెన్నంటే...

Arun Kumar P   | Asianet News
Published : Apr 09, 2021, 10:02 AM ISTUpdated : Apr 09, 2021, 10:33 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: 24గంటల్లో లక్ష టెస్టులు...పాజిటివ్ కేసులెన్నంటే...

సారాంశం

గత 24గంటల్లో అంటే బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 1,01,986మందికి కరోనా టెస్టులు చేయగా 2478మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (బుధవారం రాత్రి 8గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 1,01,986మందికి కరోనా టెస్టులు చేయగా 2478మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,21,182కు చేరితే టెస్టుల సంఖ్య 1,07,61,939కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 363మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,03,964కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,472యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. ఇందులో హోం/సంస్థల ఐసోలేషన్ లో వున్న వ్యక్తుల సంఖ్య 9,674గా వుంది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1746కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.3శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 91.2శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 94.63శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 33, నాగర్ కర్నూల్ 43, జోగులాంబ గద్వాల 9, కామారెడ్డి 98, ఆదిలాబాద్ 72, భూపాలపల్లి 11, జనగామ 23, జగిత్యాల 105, అసిఫాబాద్ 67, మహబూబ్ నగర్ 96, మహబూబాబాద్ 16, మెదక్ 33, నిర్మల్ 111, నిజామాబాద్ 176,  సిరిసిల్ల 61, వికారాబాద్ 55, వరంగల్ రూరల్ 14,  ములుగు 4, పెద్దపల్లి 33, సిద్దిపేట 54, సూర్యాపేట 39, భువనగిరి 27, మంచిర్యాల 85, నల్గొండ 88 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 402కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 208, రంగారెడ్డి 162, కొత్తగూడెం 35, కరీంనగర్ 87, ఖమ్మం 54, సంగారెడ్డి 79, వరంగల్ అర్బన్ 82కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:  

 

PREV
click me!

Recommended Stories

రేవంత్ రెడ్డి సమక్షంలో ఉగాది పంచాంగం | Ugadi Panchangam 2026 | Asianet News Telugu
Neem Trees: ఉగాది పూట వేప పువ్వు దొర‌క‌ని పరిస్థితి.. ఇంత‌కి వేప చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి.?