న్యాయం చేయండి అంటూ పోలీసులను ఆశ్రయించిన జబర్దస్త్ వినోద్

By telugu news teamFirst Published Apr 9, 2021, 7:42 AM IST
Highlights

రూ.40లక్షలకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నామని చెప్పాడు. అడ్వాన్స్ కింద తాను రూ.13.40లక్షల సొమ్ము ఇచ్చినట్లు చెప్పాడు

న్యాయం చేయాలని కోరుతూ జబర్దస్త్ వినోద్ పోలీసులను ఆశ్రయించాడు. ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించాడు. గత కొంతకాలంగా వినోద్ కీ... అతని ఇంటి యజమానికి మధ్య విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వినోద్ మరోసారి పోలీసులను ఆశ్రయించాడు.

తాను ప్రస్తుతం ఉంటున్న అద్దె ఇంటిని అమ్ముతామంటూ యజమాని తమకు ఆఫర్ ఇచ్చాడని.. రూ.40లక్షలకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నామని చెప్పాడు. అడ్వాన్స్ కింద తాను రూ.13.40లక్షల సొమ్ము ఇచ్చినట్లు చెప్పాడు. తీరా యజమాని ఇప్పుడు మాట మార్చాడని.. రూ.40లక్షల కన్నా ఎక్కువ ఇస్తేనే ఇంటిని అమ్ముతానని లేదంటే అడ్వాన్స్ డబ్బులు కూడా ఇవ్వనంటూ బెదిరిస్తున్నాడని వినోద్ వాపోయాడు.

గతంలో ఇదే విషయంలో తనపై దాడి కూడా చేశారని ఆయన పోలీసులకు వివరించాడు. తనపై దాడి చేసినప్పుడు పోలీసులకు ఫిర్యాదు  చేసినా పట్టించుకోలేదని.. ఇప్పుడైనా తనకు న్యాయం చేయండి అంటూ వినోద్ డీసీపీని కోరాడు. 
కాగా.. ఇంటి ఓనర్ దాడిలో తీవ్రంగా గాయపడ్డ వినోద్‌ తనకు ప్రాణహాని ఉందంటూ గతంలో కూడా పోలీసుల్ని ఆశ్రయించారు. హైదరాబాద్‌లోని కుత్బిగూడలో అద్దె ఇంటిలో నివసిస్తున్న వినోద్‌పై 2019 జూలై నెలలో ఇంటి ఓనర్ దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలపై పాలైన వినోద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితులపై ఐపీసీ 323, 506 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కి తరలించారు.

click me!