తెలంగాణ కరోనా అప్ డేట్: ఆ జిల్లాలో కేసుల్లేవ్... జిహెచ్ఎంసీలోనూ తగ్గిన కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Dec 25, 2020, 10:01 AM ISTUpdated : Dec 25, 2020, 10:16 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: ఆ జిల్లాలో కేసుల్లేవ్...   జిహెచ్ఎంసీలోనూ తగ్గిన కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తగ్గుతూ వస్తోంది. కొద్దిరోజులుగా అతి తక్కువ కేసులు నమోదవుతుండటంతో ఈ మహమ్మారి కోరల్లోంచి మెల్లిమెల్లిగా రాష్ట్రం బయటపడుతోంది.

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. తాజాగా గత 24గంటల్లో(బుధవారం రాత్రి 8 గంటల నుండి గురువారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 44,869మందికి పరీక్షలు నిర్వహించగా కేవలం 518మందికి మాత్రమే పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,84,074కు చేరితే టెస్టుల సంఖ్య 66,55,987కు చేరింది.

ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 491 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,75,708కి చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,839యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1527కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.4శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.8శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.05శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే కామారెడ్డిలోకేసులేవీ భయటపడలేవు. ఇక నారాయణపేట 1,  జోగులాంబ గద్వాల 3, ఆదిలాబాద్ 7, భూపాలపల్లి 6, జనగామ 7, జగిత్యాల 14, వనపర్తి 7, అసిఫాబాద్ 4, మహబూబ్ నగర్ 6, మహబూబాబాద్ 10, మెదక్ 6, నాగర్ కర్నూల్ 9,  నిర్మల్ 6, నిజామాబాద్ 11,  సిరిసిల్ల 10, వికారాబాద్ 8, వరంగల్ రూరల్ 11,  ములుగు 11, పెద్దపల్లి 15, సిద్దిపేట 12, సూర్యాపేట 9, భువనగిరి 11, మంచిర్యాల 20, నల్గొండ 21 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 91కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 39, రంగారెడ్డి 41, కొత్తగూడెం 16, కరీంనగర్ 25, ఖమ్మం 26,  సంగారెడ్డి 20, వరంగల్ అర్బన్ 35కేసులు నమోదయ్యాయి.
 
పూర్తి వివరాలు: 

 

 
 

PREV
click me!

Recommended Stories

100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?