తెలంగాణ కరోనా అప్ డేట్: గుడ్ న్యూస్...ఏడువేల దిగువకు యాక్టివ్ కేసులు

Arun Kumar P   | Asianet News
Published : Dec 20, 2020, 10:34 AM ISTUpdated : Dec 20, 2020, 10:58 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: గుడ్ న్యూస్...ఏడువేల దిగువకు యాక్టివ్ కేసులు

సారాంశం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నాయి. దీంతో ఈ మహమ్మారి కోరల్లోంచి మెల్లిమెల్లిగా రాష్ట్రం బయటపడుతోంది.

హైదరాబాద్: తెలంగాణలో కొద్దిరోజులుగా కరోనా కేసుల సంఖ్య తక్కువగా, రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటంతో యాక్టివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కేవలం 6,888 యాక్టివ్ కేసులు మాత్రమే వున్నట్లు... అందులో 4,719మంది హోం లేదా వివిధ సంస్థల ఐసోలేషన్ లోనే వున్నట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. 

ఇక తాజాగా గత 24 గంటల్లో( శుక్రవారం రాత్రి 8గంటల నుండి శనివారం రాత్రి 8గంటల వరకు)  రాష్ట్రవ్యాప్తంగా 41,970 మందికి టెస్టులు చేశారు. ఇందులో కేవలం 592మందికి మాత్రమే పాజిటివ్ గా తేలగా మిగతా అందరికి నెగెటివ్ గా తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదయిన మొత్తం కేసుల సంఖ్య 2,81,414కి చేరగా టెస్టుల సంఖ్య 64,43,052కి చేరాయి. 

ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్న వారిలో తాజాగా 643 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,73,013కి చేరింది. ఇలా కేసుల సంఖ్య తక్కువగా వుండి రికవరీల సంఖ్య ఎక్కువగా వుండటం వల్లనే యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గింది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో  ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1513కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.53శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 95.5శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 97.01శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే  జోగులాంబ గద్వాల 3, ఆదిలాబాద్ 11, కామారెడ్డి 7, నారాయణ పేట 1, భూపాలపల్లి 9, జనగామ 7, జగిత్యాల 12, వనపర్తి 5, అసిఫాబాద్ 3, మహబూబ్ నగర్ 10, మహబూబాబాద్ 8, మెదక్ 7, నాగర్ కర్నూల్ 12,  నిర్మల్ 4, నిజామాబాద్ 13,  సిరిసిల్ల 6, వికారాబాద్ 6, వరంగల్ రూరల్ 7,  ములుగు 7, పెద్దపల్లి 18, సిద్దిపేట 20, సూర్యాపేట 14, భువనగిరి 14, మంచిర్యాల 13, నల్గొండ 18, సంగారెడ్డి 11 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 119కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 70, రంగారెడ్డి 57, కొత్తగూడెం 14, కరీంనగర్ 26, ఖమ్మం 20,  సంగారెడ్డి 11, వరంగల్ అర్బన్ 40కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:

 

  

PREV
click me!

Recommended Stories

రేవంత్ రెడ్డి సమక్షంలో ఉగాది పంచాంగం | Ugadi Panchangam 2026 | Asianet News Telugu
Neem Trees: ఉగాది పూట వేప పువ్వు దొర‌క‌ని పరిస్థితి.. ఇంత‌కి వేప చెట్లు ఎందుకు ఎండి పోతున్నాయి.?