తెలంగాణ కరోనా అప్ డేట్: 24గంటల్లో 4వేల కేసులు,14మంది మృతి

Arun Kumar P   | Asianet News
Published : Apr 19, 2021, 12:58 PM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: 24గంటల్లో 4వేల కేసులు,14మంది మృతి

సారాంశం

గత 24గంటల్లో అంటే శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 83,089మందికి కరోనా టెస్టులు చేయగా 4009మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా గత 24గంటల్లో (శనివారం రాత్రి 8గంటల నుండి ఆదివారం రాత్రి 8గంటల వరకు) రాష్ట్రవ్యాప్తంగా 83,089మందికి కరోనా టెస్టులు చేయగా 4009మందికి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,55,433కు చేరితే టెస్టుల సంఖ్య 1,18,20,842కు చేరాయి.

ఇక ఇప్పటికే కరోనా బారినపడి చికిత్స పొందుతున్నవారిలో తాజాగా 1878మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 3,14,4413కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 39,154యాక్టివ్ కేసులు వున్నట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.  

ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో 14 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1838కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.51శాతంగా వుంటే దేశంలో ఇది 1.2శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 86శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 88.46శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే వనపర్తి 39, నాగర్ కర్నూల్ 33, జోగులాంబ గద్వాల 32, కామారెడ్డి 115, ఆదిలాబాద్ 72, భూపాలపల్లి 22, జనగామ 34, జగిత్యాల 175, అసిఫాబాద్ 25, మహబూబ్ నగర్ 129, మహబూబాబాద్ 36, మెదక్ 60, నిర్మల్ 90, నిజామాబాద్ 360,  సిరిసిల్ల 80, వికారాబాద్ 65, వరంగల్ రూరల్ 49,  ములుగు 26, పెద్దపల్లి 39, సిద్దిపేట 125, సూర్యాపేట 69, భువనగిరి 20, మంచిర్యాల 111 నల్గొండ 58 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. ఇక హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో అత్యధికంగా 705కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్ 363, రంగారెడ్డి 336, కొత్తగూడెం 49, కరీంనగర్ 135, ఖమ్మం 113, సంగారెడ్డి 264, వరంగల్ అర్బన్ 146కేసులు నమోదయ్యాయి.

పూర్తి వివరాలు:   

 

PREV
click me!

Recommended Stories

Telangana: బీఆర్ఎస్‌లోకి కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు.. అస‌లు కార‌ణం అదేనా.? కాంగ్రెస్ వాద‌న ఏంటంటే
Jeevan Reddy: అన్నా.. నన్ను దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని: జీవన్ రెడ్డి | Asianet News Telugu