పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా?.. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు..

By AN TeluguFirst Published Apr 19, 2021, 12:53 PM IST
Highlights

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది. ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో జనసంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సినిమా హాళ్లు, పబ్బులు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఏం చర్యలు తీసుకున్నారని హైకోర్టు అడిగింది.

ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు ఉండటం లేదని పేర్కొన్న కోర్టు.. పబ్బులు, మద్యం దుకాణాలే ముఖ్యమా? అని సూటిగా ప్రశ్నించింది. రాష్ట్రంలో జనసంచారం నియంత్రణకు ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ఏజీ కోర్టుకు తెలిపారు.

‘ప్రజల ప్రాణాలు గాల్లో తేలాడుతుంటే ఇంకెప్పుడు నిర్ణయం తీసుకుంటారు? ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందా? ఆదేశాలు ఇవ్వమంటారా?’ అని హైకోర్టు మండిపడింది ప్రభుత్వ నిర్ణయాలను మద్యాహ్నంలోగా నివేధించాలని ఆదేశించింది. భోజన విరామం తర్వాత తిరిగి విచారణ చేపడతామని మధ్యాహ్నం విచారణకు సంబంధిత అధికారులు హాజరు కావాలని కోర్టు పేర్కొంది.

ఇదిలా ఉంటే రాష్ట్రంలో బంద్‌లు, లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూ విధించే అవకాశం లేదని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం తెలిపారు. ఆదివారం నాడు  తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర ప్రభావం తెలంగాణపై ఉందన్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రమాదకరంగా మారిందని ఆయన చెప్పారు. 

సెకండ్ వేవ్ తొలుత హైద్రాబాద్‌లో మొదలైందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా  కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నారని  ఆయన చెప్పారు.  ప్రస్తుతం రాష్ట్రంలో 260 టన్నుల  ఆక్సిజన్  అవసరమౌంది. రానున్ రోజుల్లో  ఇది 300 టన్నుకు పెరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 

click me!