తెలంగాణ కరోనా అప్ డేట్: రంగారెడ్డి, మేడ్చల్ లతో కొత్తగూడెం పోటీ... తాజా కేసులెన్నంటే

Arun Kumar P   | Asianet News
Published : Nov 17, 2020, 09:16 AM ISTUpdated : Nov 17, 2020, 09:31 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: రంగారెడ్డి, మేడ్చల్ లతో కొత్తగూడెం పోటీ... తాజా కేసులెన్నంటే

సారాంశం

తెలంగాణలో సోమవారం గణనీయంగా తగ్గిన కరోనా కేసులు ఇవాళ(మంగళవారం) మళ్లీ పెరిగాయి. 

హైదరాబాద్: తెలంగాణలో నిన్న(సోమవారం) భారీగా తగ్గిన కరోనా కేసులు తాజాగా మళ్లీ పెరిగాయి. ఇవాళ(మంగళవారం) వైద్యారోగ్య శాఖ ప్రకటించిన బులెటిన్ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో(ఆదివారం రాత్రి 8గంటల నుండి సోమవారం రాత్రి 8గంటల వరకు) 30,245మందికి టెస్టులు చేయగా 952 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో కలిసి మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,58,828కి చేరగా టెస్టుల సంఖ్య 49,29,974కు చేరాయి.

ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో తాజాగా 1602 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,43,686కి చేరింది. దీంతో  ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 13,732కి చేరింది. 

Read more  తెలంగాణ కరోనా అప్ డేట్: గణనీయంగా తగ్గిన కేసులు, ఆ జిల్లాల్లో అయితే జీరో కేసులు

 ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1410కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 93.4శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 94.14శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 150కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 77, రంగారెడ్డి 68, భద్రాద్రి కొత్తగూడెం 71, కరీంనగర్ 35, ఖమ్మం 41, నాగర్ కర్నూల్ 16, నిజామాబాద్ 23, సంగారెడ్డి 20, సిద్దిపేట 23, సూర్యాపేట 32, వరంగల్ అర్బన్ 44, పెద్దపల్లి 29, నల్గొండ 45, మంచిర్యాల 33, జగిత్యాల 26 కేసులు నమోదయ్యాయి.  

పూర్తి వివరాలు:

 

 

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో కొంద‌రు పెళ్ల‌యిన మ‌హిళ‌లు రాత్రి 10 త‌ర్వాత ఏం చేస్తున్నారో తెలుసా.? షాకింగ్ విష‌యాలు
Jayalalitha Assets: హైదరాబాద్‌లో జయలలిత భవనానికి GHMC సీల్.. అసలు కారణం ఇదే | Asianet News Telugu