కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బండ కార్తీక ?

Published : Nov 16, 2020, 09:46 PM IST
కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలోకి మాజీ జీహెచ్ఎంసీ మేయర్ బండ కార్తీక ?

సారాంశం

జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. గురువారం నాడు ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

హైదరాబాద్: జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బండ కార్తీక బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. గురువారం నాడు ఆమె బీజేపీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  జీహెచ్ఎంసీ మేయర్ గా బండ కార్తీక పనిచేశారు. 2009 నుండి 2012 వరకు బండ కార్తీక పనిచేశారు. హైద్రాబాద్ మేయర్ గా విధులు నిర్వహించారు.గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ టికెట్టును ఆమె ఆశించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెకు టికెట్టు ఇవ్వలేదు.

దీంతో ఆమె అసంతృప్తితో ఉంది. కాంగ్రెస్ పార్టీకి బండ కార్తీక రాజీనామా చేయనున్నారని సమాచారం.సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని బీజేపీ బండ కార్తీకకు హామీ ఇచ్చారని ప్రచారం సాగుతోంది. అయితే ఈ విషయమై స్పష్టత రాలేదు.

త్వరలోనే జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో  బండ కార్తీక కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి  బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.గురువారం నాడు బండ కార్తీక బీజేపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది.ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో కొత్త‌గా ఎలివేటెడ్ కారిడార్లు.. ఈ ప్రాంతాల్లో భూముల ధ‌ర‌లు పెర‌గ‌డం ఖాయం
Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!