తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా తగ్గిన పాజిటివ్ కేసులు

Published : Nov 11, 2020, 08:50 AM IST
తెలంగాణ కరోనా అప్ డేట్: తాజాగా తగ్గిన పాజిటివ్ కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య కాస్త తక్కువగా నమోదయ్యాయి. 

హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతూనే వుంది. తాజాగా(సోమవారం రాత్రి 8గంటల నుండి మంగళవారం రాత్రి 8గంటల వరకు)రాష్ట్రవ్యాప్తంగా 44,635 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 1196 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 47,29,401 కి చేరగా కేసుల సంఖ్య 2,53,651 కి చేరింది. 

ఇప్పటికే కరోనా బారినపడిన వారిలో 1745 మంది కోలుకున్నారు. దీంతో కరోనా నుండి రికవరీ అయినవారి మొత్తం సంఖ్య 2,34,234కి చేరింది. దీంతో  ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,027కి చేరింది. 

read more   తెలంగాణ కరోనా అప్ డేట్: భారీగా తగ్గిన పాజిటివ్ కేసులు, కారణమిదే

 ఇదిలావుంటే గత 24గంటల్లో రాష్ట్రంలో కరోనాతో ఐదుగురు మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1390కి చేరింది. రాష్ట్రంలో కరోనా మరణాల రేటు 0.54శాతంగా వుంటే దేశంలో ఇది 1.5శాతంగా వుంది. రికవరీ రేటు దేశంలో 92.7శాతంగా వుంటే రాష్ట్రంలో మాత్రం 92.34శాతంగా వుంది. 

జిల్లాలవారిగా కేసుల సంఖ్యను పరిశీలిస్తే అత్యధికంగా హైదరాబాద్(జిహెచ్ఎంసి)లో 192కేసులు నమోదయ్యాయి. ఇక మేడ్చల్ 101, రంగారెడ్డి 121, భద్రాద్రి కొత్తగూడెం 81, కరీంనగర్ 73, ఖమ్మం 42, నల్గొండ 89 కేసులు నమోదయ్యాయి. మిగతాజిల్లాలో కేసుల సంఖ్య కాస్త తక్కువగా వున్నాయి. 

పూర్తి వివరాలు

 

   


 

PREV
click me!

Recommended Stories

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలతో హై అలర్ట్.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ హెచ్చరిక రానున్న 24 గంటల్లో | Heavy Rain Alert for AP & Telangana