
హైదరాబాద్: తెలంగాణలో సాగుతున్న నిరంకుశ పాలన అంతం కావాలని తాము కోరుకొంటున్నట్టుగా టీజేఎస్ చీఫ్ కోదండరామ్ చెప్పారు.ప్రజల పక్షాన నిలబడింది టీజేఎస్ మాత్రమేనన్నారు.
సోమవారం నాడు సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పార్టీని క్షేత్రస్థాయి నుండి బలోపేతం చేస్తున్నామన్నారు. గ్రామస్థాయిలో టీజేఎస్‌కు మంచి పట్టుందని ఆయన చెప్పారు. పార్టీ ఏర్పాటు కాకముందే క్షేత్రస్థాయి నుండి నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించినట్టు ఆయన గుర్తు చేశారు.
తెలంగాణలో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆయన విమర్శించారు. టీఆర్ఎస్ విధానాలతో ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు. రైతు బంధు పథకం తీవ్ర గందరగోళంగా మారిందన్నారు.
సంబంధిత వార్తలు
టీడీపీ స్థానంలో టీజేఎస్ పోటీ: ఏడుగురితో టీజేఎస్ జాబితా