ఈటలపై దాడి తెలంగాణ ఆత్మగౌరవంపై దాడే: కోదండరామ్

Published : May 27, 2021, 10:52 AM ISTUpdated : May 27, 2021, 10:57 AM IST
ఈటలపై దాడి తెలంగాణ ఆత్మగౌరవంపై దాడే: కోదండరామ్

సారాంశం

రాజకీయ విభేధాలు ఉంటే చర్చించుకోవాలి కానీ, కక్షపూరితంగా వ్యవహరించడం తగదని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ సీఎం కేసీఆర్ ను కోరారు. గురువారం నాడు  మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ భేటీ అయ్యారు.   

హైదరాబాద్: రాజకీయ విభేధాలు ఉంటే చర్చించుకోవాలి కానీ, కక్షపూరితంగా వ్యవహరించడం తగదని టీజేఎస్ చీఫ్ కోదండరామ్ సీఎం కేసీఆర్ ను కోరారు. గురువారం నాడు  మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,  టీజేఎస్ చీఫ్ కోదండరామ్ భేటీ అయ్యారు. 

also read:సస్పెన్స్ కొనసాగింపు: ఈటెల రాజేందర్ తో కొండా, కోదండరామ్ భేటీ

ఈ భేటీ ముగిసిన తర్వాత  కోదండరామ్ మీడియాతో మాట్లాడారు.  తనకు నచ్చని అభిప్రాయాలను వ్యక్తం చేసిన వారిని అణగదొక్కడమే కేసీఆర్ నైజమని ఆయన చెప్పారు. ప్రజాస్వామ్య పద్దతులు పాటించడం కేసీఆర్ కు అలవాటు లేదన్నారు. ఈటల కుటుంబసభ్యులపై కేసులు బనాయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈటలపై దాడి తెలంగాణ ఆత్మగౌరవంపై దాడిగా ఆయన అభివర్ణించారు. 
ఎవరైనా సరే కేసీఆర్ నీడలోనే  అందరూ బతకాలని అనుకొంటారని ఆయన చెప్పారు.
 
కరోనా సమయంలో తమ సమస్యలు పరిష్కరించాలని జూడాలు సమ్మె నిర్వహిస్తున్నారు. వారి సమస్యలు పరిష్కరించకుండా తనకు గిట్టని వారిపై కేసులు పెట్టేందుకు కేసీఆర్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని కోదండరామ్ విమర్శించారు.  ఈ విషయమై అందరం ఏకోన్ముఖంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Constable Recruitment 2025 : 48954 పోలీస్ జాబ్స్.. తెలుగులోనే పరీక్ష, తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామ్ సెంటర్
Hyderabad: యువ‌త త‌ల రాత మార్చేలా.. హైద‌రాబాద్‌లో గూగుల్ తొలి స్టార్ట‌ప్స్ హ‌బ్, దీని ఉప‌యోగం ఏంటంటే