సస్పెన్స్ కొనసాగింపు: ఈటెల రాజేందర్ తో కొండా, కోదండరామ్ భేటీ

By narsimha lodeFirst Published May 27, 2021, 10:12 AM IST
Highlights

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో  చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్  గురువారం నాడు భేటీ అయ్యారు.బీజేపీలో ఈటల రాజేందర్ చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.
 

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌తో  చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ జనసమితి చీఫ్ కోదండరామ్  గురువారం నాడు భేటీ అయ్యారు.బీజేపీలో ఈటల రాజేందర్ చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ కు కొండా విశ్వేశ్వర్ రెడ్డి   గుడ్ బై చెప్పారు.  ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఇటీవల కాలంలో ఆయన కాంగ్రెస్ కు కూడ రాజీనామా చేశారు. మంత్రివర్గం నుండి  భర్తరఫ్ నకు గురైన తర్వాత ఈటల రాజేందర్ ను  కొండా విశ్వేశ్వర్ రెడ్డి  కలిశారు.  గతంలో ఒక్క సారి కోదండరామ్ తో ఈటల రాజేందర్ భేటీ అయ్యారు.

also read:బీజేపీలోకి ఈటల: అనుచరులతో ఇవాళ కూడ భేటీ, త్వరలో ఢిల్లీకి?

కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరామ్ శామీర్ పేటలోని ఈటల రాజేందర్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరుతారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ భేటీకి రాజకీయంగా ప్రాధాన్యత నెలకొంది. బీజేపీలో చేరే విషయమై ఈటల రాజేందర్ అనుచరులతో రెండు రోజులుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడ అనుచరులతో సమావేశమౌతున్నారు.  కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కోదండరామ్ లతో భేటీ నేపథ్యంలో  అనచురులతో భేటీకి ఈటల రాజేందర్ బ్రేక్ వేశారు. ఈలల రాజేందర్ తో భేటీ తర్వాత ఈ ఇద్దరు నేతలు ఏం చెబుతారనే విషయాన్ని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా చూస్తున్నారు. 

click me!