బాలుడి కిడ్నాప్.. చితకబాదిన కుటుంబసభ్యులు

Published : Aug 25, 2020, 11:08 AM ISTUpdated : Aug 25, 2020, 11:16 AM IST
బాలుడి కిడ్నాప్.. చితకబాదిన కుటుంబసభ్యులు

సారాంశం

నవీపేట మండలం దండిగుట్టకు చెందిన లక్ష్మి అనే మహిళ ఈ నెల 17న బస్టాండ్‌లో వుండగా...బాసరకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మాటలు కలిపాడు. ఆ తర్వాత ఆమె ఏడాదిన్నరబాబును ఎత్తుకుపోయాడు.

నిజామాబాద్ లో కిడ్నాప్ కలకలం రేగింది. ఓ వ్యక్తి.... ఓ మహిళ చేతిలోని పసిబిడ్డను ఎత్తుకువెళ్లాడు. కాగా.. ఆ కిడ్నాపర్ ని వెతికి పట్టుకొని మరీ చితకబాదారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

నవీపేట మండలం దండిగుట్టకు చెందిన లక్ష్మి అనే మహిళ ఈ నెల 17న బస్టాండ్‌లో వుండగా...బాసరకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మాటలు కలిపాడు. ఆ తర్వాత ఆమె ఏడాదిన్నరబాబును ఎత్తుకుపోయాడు.

బిడ్డ కోసం 15 రోజులు వెతికి వేసారి పోయిన లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులకు చివరికి నిజామాబాద్‌ మున్సిపల్‌ ఆఫీస్‌ వద్ద నాగరాజు కన్పించాడు. బిడ్డ ఎక్కడున్నాడో చెప్పమంటూ చెట్టుకు కట్టి గ్రామస్తులు నాగరాజును చితక్కొట్టారు. ఆ రోజే తన వద్ద బాబును ఎవరో ఎత్తుకెళ్లారంటూ సమాధానం చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. బిడ్డ జాడ మాత్రం ఇంతవరకు దొరకలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Cold Wave Alert: బ‌య‌ట‌కు వెళ్లే ముందు జాగ్ర‌త్త‌.. ఈ ప్రాంతాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్ జారీ
Cold wave: హైదరాబాదా లేదా క‌శ్మీరా? దారుణంగా పడిపోతున్న టెంపరేచర్, వచ్చే 3 రోజులూ ఇంతే