కవితను బీఆర్ఎస్‌ నుండి సస్పెండ్ చేయాలి: కోదండరామ్ డిమాండ్

By narsimha lode  |  First Published Mar 9, 2023, 2:52 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కవితకు  ఈడీ నోటీసులు జారీ చేయడంపై  టీజేఎస్ స్పందించింది.  ఈ నోటీసులను తెలంగాణ సమాజానికి  ముడిపెట్టడాన్ని ఆయన తప్పుబట్టారు.  


హైదరాబాద్:  కవిత  ఎపిసోడ్  ను తెలంగాణ సమస్యగా  చిత్రీకరించడం  సరికాదని  తెలంగాణ జనసమితి  చీఫ్  కోదండరామ్  అభిప్రాయపడ్డారు.గురువారంనాడు  హైద్రాబాద్ లో  ఆయన మీడియాతో మాట్లాడారు.  కవిత  అంశం  తెలంగాణ ప్రజల  సమస్య కాదన్నారు. ఈ అంశాన్ని తెలంగాణకు ముడిపెట్టడాన్ని కోదండరామ్ తప్పుబట్టారు. స్వంత  వ్యాపారం కోసం  అధికారాన్ని ఎలా దుర్వినియోగం  చేస్తారని  ఆయన ప్రశ్నించారు.  

కవితను  పార్టీ నుండి  కేసీఆర్  ఎందుకు  సస్పెండ్  చేయడం లేదని  ఆయన ప్రశ్నించారు. రేపు మిలియన్ మార్చ్ స్పూర్తితో  తెలంగాణ బచావో  సదస్సు ను నిర్వహిస్తామన్నారు.  తెలంగాణ  ఉద్యమకారులు, మేధావులు  సదస్సుకు  తరలి రావాలని ఆయన కోరారు.

Latest Videos

undefined

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు  నిన్న  ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చారు.ఈ నెల  9వ తేదీన  విచారణకు  రావాలని కోరారు. అయితే  ఈ నెల  9వ తేదీన విచారణకు రావడం  వీలు పడదని  కవిత  ఈడీ అధికారులకు  లేఖ రాశారు. ఈ నెల  11న  ఈడీ విచారణకు  రానున్నట్టుగా  కవిత  సమాచారం  ఇచ్చారు.  ఈ నెల  10వ  తేదీన ఢిల్లీలో  జంతర్ మంతర్ వద్ద కవిత దీక్ష  చేయనున్నారు.  మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశ పెట్టాలని  దీక్ష నిర్వహించనున్నారు కవిత.ఈ దీక్షలో  పలు  విపక్ష పార్టీల  ప్రతినిధులు  పాల్గొంటారు. 

also rea:కవితకు అవమానం జరిగితే తెలంగాణకు జరిగినట్టా? : భట్టి విక్రమార్క

ఈ  నెల  6వ తేదీన  ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరుణ్ రామచంద్రపిళ్లైని ఈడీ అధికారులు అరెస్ట్  చేశారు. అరుణ్ రామచంద్ర పిళ్లై రిమాండ్ రిపోర్టులో  కవిత  పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు.  అరుణ్  రామచంద్ర పిళ్లైని  అరెస్ట్  చేసిన  మరునాడే  కవితకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 
 

click me!