ఊపందుకుంటున్న జెఎసి స్పూర్తియాత్ర

First Published Jun 16, 2017, 11:34 AM IST
Highlights

తెలంగాణ జెఎసి అమరవీరుల స్పూర్తియాత్ర ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. ఈనెల 21 న సంగారెడ్డిలో ఈ యాత్ర ప్రారంభం కానుంది. సంగారెడ్డి నుంచి సిద్ధిపేట వరకు యాత్ర కొనసాగనుంది. యాత్ర జరిగే ప్రాంతంలో దారి పొడవునా భారీగా జనాలను తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

మండల కేంద్రాలు, గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున యాత్రలో మమేకం అయ్యేందుకు టి జెఎసి కసరత్తు చేస్తోంది. ఈనెల 21 న సంగారెడ్డి నుండి టీజేఏసీ చేబట్టిన "అమరుల స్ఫూర్తి యాత్రకు" పెద్దఎత్తున ప్రజలను, కార్యకర్తలను తరలించాలని జెఎసి పిలుపునిచ్చింది. యాత్రపై స్థానిక ప్రజానీకంలో అవగాహన కల్పించాలని కోరింది.

ఈమేరకు రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు, రీజినల్ కో ఆర్డినేటర్లు, జిల్లా, డివిజన్, మండల బాధ్యులు, వివిధ సంఘాలు తమతమ కమిటీల, సంఘాల సభ్యులతో సన్నాహక సమావేశాలు పెట్టుకోవాలని కోరింది. మీడియా సమావేశాలు నిర్వహించి ప్రజలను చైతన్యం చేయాని సూచించింది.

జెఎసి పిలుపునందుకున్న  కోహిర్ మండల జెఎసి నేతలు ఇప్పటికే పోస్టర్లు ముద్రించి ప్రచారం షురూ  చేశారు. అమర వీరుల ఆశయాల సాధన  కోసం చేపట్టిన యాత్రలో జనాలు తరలివచ్చి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు.

తెలంగాణ జెఎసి తలపెట్టిన స్పూర్తి యాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చను లేవనెత్తే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. దశల వారీగా తెలంగాణలోని అన్ని జిల్లాలను ఈ అమర వీరుల స్పూర్తి యాత్ర ద్వారా చుట్టి రానున్నారు కోదండరాం. అయితే అధికార టిఆర్ఎస్ పార్టీ జెఎసి యాత్రను నిశితంగా గనించనుంది. 

click me!