ఆటోను ఢీ కొట్టి టిప్పర్ లారీ.. ముగ్గురు మృతి, పలువురికి తీవ్రగాయాలు...

Published : Jan 06, 2022, 07:39 AM IST
ఆటోను ఢీ కొట్టి టిప్పర్ లారీ.. ముగ్గురు మృతి, పలువురికి తీవ్రగాయాలు...

సారాంశం

పటాన్ చెరులోని ఇస్నాపూర్ వద్ద  టిప్పర్ లారీ ఓ ఆటోని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారి మృతదేహాలను పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

సంగారెడ్డి : పటాన్ చెరులోని ఇస్నాపూర్ వద్ద ఘోర Road accident చోటు చేసుకుంది. టిప్పర్ లారీ ఓ ఆటోని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వేగంగా వచ్చిన Tipper truck ఆటోను ఢీ కొట్టడంతో ఆటో నుజ్జు నుజ్జు అయ్యింది. Autoలో ఉన్న ఒకరు మృతి చెందగా.. రోడ్డుపై నడుచుకుంటూ వెడుతున్న మరో ఇద్దరు మృతిచెందారు. 

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతి చెందిన వారి dead bodyలను పటాన్ చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు ప్రయాణిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తీవ్ర గాయాల పాలైన మరొకరిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని జిల్లా ఎస్పీ రమణ కుమార్ పరిశీలించారు. 

ఇదిలా ఉండగా, సూర్యపేటలో దారుణం చోటు చేసుకుంది. భార్యతో extramarital affair నెరుపుతున్నాడనే అనుమానంతో ఓ యువకుడిని దమ్ము చక్రాలతో తొక్కించి అత్యంత కిరాతకంగా murder చేశారు.ఈ పాశవిక ఘటన హుజూర్ నగర్ మండలం లక్కవరంలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు, మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన మహేష్ (30) రైతు. మంగళవారం గూబగుట్టకు వెళ్లే దారిలో తన అన్న నాగరాజు పొలంలో నాట్లు వేసే పనిలో మహేష్ సైతం పాల్గొన్నాడు.

Employees Postings: కొత్త జోనల్ ప్ర‌కారమే బదిలీలు, పోస్టింగులు..! మూడు రోజుల్లోపు చేరాలని ఆదేశాలు

నాట్లు ముగిసిన తర్వాత కూలీలను స్వగ్రామంలో దింపడానికి నాగరాజు ట్రాక్టర్ తీసుకుని వెళ్ళాడు. తర్వాత మహేష్ తన టూవీలర్ వాహనంపై ఇంటికి బయల్దేరాడు.  అదే సమయంలో గ్రామానికి చెందిన Tractor driver ఒకరు పొలాన్ని దమ్ము చేసి అదే దారిలో ఇంటికి వెళ్తున్నాడు.  టూ వీలర్ పై ఒంటరిగా వెళ్తున్న మహేష్ ను అతను గమనించాడు. ఇది వరలో వారిద్దరికీ ఉన్న పాత కక్షలు గుర్తుకువచ్చాయి. 

మహేష్ ఒంటరిగా దొరకడంతో తన పగ తీర్చుకోవచ్చనుకున్నాడు. ఈ నేపథ్యంలో  ట్రాక్టర్ తో మహేష్ టూవీలర్ ఢీకొట్టాడు. దీంతో మహేష్ ద్విచక్ర వాహనంతో సహా పక్కనే ఉన్న దమ్ము చేసిన మడిలో పడిపోయాడు. పడిపోయిన  అతనిపై నుంచి ట్రాక్టర్ ను తోలాడు. దీంతో మహేష్ అక్కడికక్కడే మరణించాడు. ఘటనాస్థలానికి కొద్దిదూరంలో ట్రాక్టర్ ను వదిలేసి పారిపోయాడు. బుధవారం ఉదయం అటువైపు వచ్చిన రైతులు మడిలో శవం ఉండడం గమనించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు.  పోలీసుల  విచారణలో పలు అంశాలు వెలుగు చూశాయి.

భార్య వివాహేతర సంబంధం.. యువకుడిని దమ్ము చేసిన మడిలో.. ట్రాక్టర్ తొక్కించి పాశవికంగా హత్య...

ట్రాక్టర్ డ్రైవర్ భార్యకు మహేష్ తో వివాహేతర సంబంధం ఉందని.. ఇదే విషయంపై నాలుగేళ్ల కిందట గ్రామంలో పెద్ద మనుషుల పంచాయితీ పెట్టించారని తెలిసింది. ఆ తర్వాత సమస్య సద్దుమణిగినా.. ఇటీవల మళ్లీ తన భార్య  జోలికి  మహేష్  వస్తున్నాడని అనుమానం పెంచుకున్న సదరు వ్యక్తి  ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు భావిస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు