
ఈనెల 20వ తేదీన జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరి జన్మదినోత్సవం ఉంది. ఇద్దరూ ప్రతిపక్షంలో ఉన్నతమైన హోదాలో ఉన్నవారే కావడంతో తెలంగాణ సిఎం కెసిఆర్ వారిద్దరి ఇళ్లకు తెలంగాణ సిఎం కెసిఆర్ పూల బొకేలు పంపించారు.
దీంతోపాటు వారిద్దరికీ ముఖ్యమంత్రి జన్మదిన శుభాకాంక్షలతోపాటు ప్రత్యేక జన్మదిన సందేశాలు కూడా రాసి పంపారు. ప్రజలకు మరింత సేవ చేసేలా భగవంతుడు వారిని ఆశీర్వదించాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. జన్మదిన శుభాకాంక్షల సందేశం అందుకున్న జానారెడ్డి సిఎం కేసీఆర్ కు ఫోన్ చేసి ధన్యవాదాలు తెలిపారు.
మొత్తానికి రాజకీయాలు రాజకీయాలే మానవ సంబంధాలు మానవ సంబంధాలే అని రుజువు చేశారు మన ముగ్గురు నేతలు.