
హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై (Tank Bund) బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు, కారు ఢీ కొన్న ఘటనలో మూడేళ్ల చిన్నారి శ్రీ మృతిచెందింది. ఈ ప్రమాదంలో చిన్నారి తల్లిదండ్రులతో సామాన్య, శివకుమార్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్య చికిత్స కోసం యశోద ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన సామాన్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకన్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
బాధితులు రాయదుర్గం నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్యాబ్ డ్రైవర్ (cab driver) నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న గాంధీ నగర్ పోలీసులు తెలిపారు.