ప్రేమ వ్యవహారాలు, నిర్లక్ష్యం.. వరంగల్ లో ముగ్గురు పోలీసు అధికారుల సస్పెన్షన్..

By SumaBala Bukka  |  First Published Jan 4, 2023, 11:28 AM IST

ఒక మహిళా ఎస్సైతో పాటు మరో ఇద్దరు పోలీసు అధికారుల మీద వరంగల్ సీపీ రంగనాథ్ సస్పెన్షన్ వేటు వేశారు. పెళ్లినా పోలీసు అధికారుల మధ్య ప్రేమవ్యవహారమే దీనికి కారణంగా తెలుస్తోంది. 


వరంగల్ : వరంగల్లో ఇద్దరు ఎస్ఐలు, ఒక సీఐపై సిపి రంగనాథ్ సస్పెన్షన్ వేటు వేశారు. వీరి అనైతిక ప్రవర్తనతో విసిగిపోయి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సస్పెన్షన్కు గురైన వారిలో దామెర ఎస్సై హరిప్రియ, సుబేదారిఎస్ఐ పున్నంచందర్,  గీసుకొండ సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారు. దామెర ఎస్సై హరిప్రియకు పెళ్లయి నెల రోజులైంది. కానీ, ఆమెకు అంతకు ముందే ఓ ఇన్ స్పెక్టర్ తో పరిచయం ఉంది. అతనితో కలిసి పర్సనల్గా గడిపింది. దీంతో వీరి ప్రేమ వ్యవహారం భర్తకు తెలిసింది.  అలా విషయం వెలుగులోకి వచ్చింది.

ఇక మరో ఎస్ఐ లైంగిక వేధింపుల బారిన పడిన ఓ యువతి  న్యాయం చేయమంటూ పోలీస్ స్టేషన్ కు వస్తే.. అది పట్టించుకోకుండా రాజీపడమంటూ ఉచిత సలహా ఇచ్చాడు. ఈ మేరకు విషయం తెలియడంతో వీరి చర్యలు, ఇలాంటి  ప్రవర్తన సహించేది లేదు అంటూ సీపీ రంగనాథ్ ముగ్గురిని సస్పెండ్ చేశారు. అంతేకాదు వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ఘటనలు ఇలా ఏమి జరిగినా.. కఠిన చర్యలు ఉంటాయని..  తప్పించుకోలేరని సంకేతాలిచ్చారు. సిపిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నెలరోజుల్లోనే దిద్దుబాటు చర్యలకు దిగారు. దీంతో  నిబంధనలు అతిక్రమించి ఇష్టారాజ్యంగా వ్యవహరించే పోలీసుల్లో భయం మొదలైంది. 

Latest Videos

undefined

వివరాల్లోకి వెళితే.. క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటూ,  సామాన్య జనానికి ఆదర్శంగా ఉండాల్సిన పోలీస్ శాఖలో కొంతమంది అధికారుల ప్రవర్తన హద్దులు మీరుతున్నారు. దీంతో పోలీస్ శాఖ అంటేనే చిన్నచూపుగా మారుతోంది. తలవంపులు తెచ్చిపెడుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గీసుకొండ ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు, దామెర సబ్ ఇన్స్పెక్టర్ హరిప్రియలు హద్దులు మీరి ప్రవర్తించారు. దీంతో వీరిద్దరిని వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది  కమిషనరేట్ పరిధిలో సంచలనంగా మారింది.

కారణమిదీ: మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే చిన్నయ్య దాడి

ఎస్ఐ హరిప్రియకు ఇటీవలే పెళ్లయ్యింది. కానీ, ఇన్స్పెక్టర్ రాయల వెంకటేశ్వర్లు తో ఉన్న తన పాత ప్రేమను వదులుకోలేక పోయింది. దీంతో ఆమె ప్రవర్తన భర్తకు అనుమానం వచ్చింది. ఆమె ఫోన్ మీద నిఘా పెట్టి, వాట్సాప్ చాటింగ్ గమనించాడు. అందులో వీరిద్దరి ప్రేమాయణం బయటపడడంతో సిపి రంగనాథ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ మేరకు దీని మీద విచారణ చేపట్టిన సిపి.. హరిప్రియ భర్త చేసిన ఫిర్యాదు వాస్తవమేనని తేలడంతో ఇద్దరి మీదా సస్పెన్షన్ వేటు వేశారు.

ఇక సుబేదారి పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పి. పున్నంచందర్ విధులు నిర్వహిస్తున్నారు. లైంగిక వేధింపులకు గురవుతున్నా, రక్షించండి అంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడానికి వస్తే నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. అంతేకాదు రాజీ చేసుకోమంటూ ఉచిత సలహా కూడా పడేశాడు. షాక్ అయినా బాధితురాలు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. దీని మీద విచారణ చేసి, నివేదికను సీపీకి సమర్పించారు అధికారులు. నివేదిక ప్రకారం పున్నం చందర్ పై సస్పెండ్  వేటు పడింది.

సి పి రంగనాథ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా డిసెంబర్ 3న బాధ్యతలు స్వీకరించారు. వెంటనే ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టారు. నెలరోజుల్లోనే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఐదుగురిపై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో వరంగల్ కమిషనరేట్ పరిధిలో సీపీ రంగనాథ్ చర్చనీయాంశంగా మారారు.

click me!