కారణమిదీ: మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే చిన్నయ్య దాడి

Published : Jan 04, 2023, 10:30 AM IST
కారణమిదీ:  మందమర్రి  టోల్ ప్లాజా సిబ్బందిపై  ఎమ్మెల్యే చిన్నయ్య దాడి

సారాంశం

తన వాహనానికి  రూట్ క్లియర్   చేయలేదని మందమర్రి  టోల్ ప్లాజా సిబ్బందిపై  ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య దాడికి దిగారు.

బెల్లంపల్లి: మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై బెల్లంపల్లి  ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  చేయి చేసుకున్నాడు.  ఈ దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. మంచిర్యాల నుండి  మహరాష్ట్రకు  363 జాతీయ రహదారి  ఏర్పాటైంది. ఈ జాతీయరహదారిపై  మందమర్రి   కేకే ఓసీపీ గని సమీపంలో  టోల్ ప్లాజా ను ఏర్పాటు  చేశారు.. ఈ రహదారి పనులు ఇంకా పూర్తి కాలేదు. అయినా కూడా  టోల్ ప్లాజా  ఏర్పాటు చేయడంపై  ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.  మంగళవారంనాడు  ఎమ్మెల్యే  దుర్గం చిన్నయ్య వాహనానికి టోల్ ప్లాజా సిబ్బంది రూట్ క్లియర్ చేయలేదు. దీంతో  వాహనం దిగి వచ్చి ఎమ్మెల్యే  టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి దిగాడు.   ప్రభుత్వ వాహనాలు , అంబులెన్స్ లు వెళ్లేలా  ప్రత్యేక  మార్గం ఏర్పాటు చేయకపోవడంపై   టోల్ ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.   టెక్నికల్ కారణాలతోనే  ఎమ్మెల్యే వాహనానికి  రూట్ క్లియర్ చేయలేకపోయినట్టుగా  టోల్ ప్లాజా సిబ్బంది చెబుతున్నారు.  టోల్ ప్లాజా సిబ్బందిపై  దాడి ఘటనకు సంబంధించి  ఎలాంటి  ఫిర్యాదు అందలేదని  పోలీసులు  చెబుతున్నారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ టీవీ 9 కథనం ప్రసారం చేసింది.  

PREV
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్