హైద్రాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి మారెమ్మ అనే మహిళ ఇవాళ ఆత్మహత్య చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు చెబుతున్నారు.
హైదరాబాద్: నగరంలోని ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి బుధవారం నాడు మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ కు చెందిన మారెమ్మగా గుర్తించారు. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నిర్ధారించారు
దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ప్రతి రోజూ ఆత్మహత్యలకు సంబంధించిన కేసులు నమోదౌతున్నాయి.చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నారు. ఆర్ధిక ఇబ్బందులు, ప్రేమ ఫెయిలై ఇతర కారణాలతో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్నవరంలో గత ఏడాది డిసెంబర్ 25న అక్కా, తమ్ముడు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంట్లో వీరిద్దరూ ఉరేసుకున్నారు.
కొడుకు విదేశాలకు వెళ్లి చదువుకోవడం ఇష్టం లేని ఓ తల్లి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గత ఏడాది డిసెంబర్ 22న నెల్లూరు జిల్లాలో జరిగింది. సదాశివరెడ్డి అనే యువకుడు విదేశాల్లో చదువుకునేందుకు పేరేంట్స్ అంగీకరించలేదు. కానీ అతను మాత్రం తాను విదేశాల్లో చదువుకుంటాని తెగేసి చెప్పాడు. ఈ విషయమై కొడుకుతో గొడవ పెట్టుకున్న తల్లి ఆత్మహత్య చేసుకుంది.తెలంగాణలోని బాసరలో చదువుతున్న విద్యార్ధి భాను ప్రసాద్ గత ఏడాది డిసెంబర్ 19న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.