హైద్రాబాద్ రాజేంద్రనగర్ లో ఓ పుట్టిన రోజు వేడుకలో డ్యాన్సర్ ను నగ్నంగా డ్యాన్స్ చేయాలని వేధింపులకు పాల్పడ్డారు.
హైదరాబాద్: హైద్రాబాద్ రాజేంద్రనగర్లో దారుణం చోటు చేసుకొంది. పుట్టిన రోజు వేడుకల్లో నగ్నంగా డ్యాన్స్ చేయాలని మహిళలను వేధింపులకు పాల్పడ్డారు. అలా చేయనందుకు ఒక రూమ్లో బంధించి మహిళలను చిత్రహింసలు పెట్టారు.
also read:స్టూడెంట్ సంధ్య సూసైడ్: మార్చురీ తలుపులు ధ్వంసం, కాలితో తన్నిన కానిస్టేబుల్
undefined
హైద్రాబాద్ రాజేంద్రనగర్ పట్టణంలో బర్త్డే వేడుకల్లో డ్యాన్స్ కోసం ఓ మహిళను కత్తులతో బెదిరించారు. ఈవెంట్ ఆర్గనైజర్ కు కాంట్రాక్ట్ ఇచ్చారు. మద్యం మత్తులో మహిళను కత్తులతో బెదిరించారు నిందితులు.
బర్త్ డే వేడుకల్లో నగ్నంగా డ్యాన్స్ చేయాలని నలుగురు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. బుధవారం నాడు ఉదయం మహిళ తప్పించుకొంది. ఈ విషయమై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అమీర్ అలీ, సుల్తాన్, సలీమ్ తో పాటు మరో వ్యక్తి బెదరింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేసింది.