మైనర్ బాలికపై అటెండర్ అత్యాచారం.. గర్భం రావడంతో..

Published : Feb 26, 2020, 03:14 PM IST
మైనర్ బాలికపై అటెండర్ అత్యాచారం.. గర్భం రావడంతో..

సారాంశం

మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడు. ఇటీవల బాలిక కడుపునొప్పితో బాధపడుతుండగా.. తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  


తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలికపై స్కూల్లో అటెండర్ గా పనిచేసే ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. ఈ దారుణ సంఘటన  యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాలలో చోటుచేసుకుంది.

Also Read స్టూడెంట్ సంధ్య సూసైడ్: మార్చురీ తలుపులు ధ్వంసం, కాలితో తన్నిన కానిస్టేబుల్...

పూర్తి వివరాల్లోకి వెళితే... చిట్యాల మండలంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థినిపై అదే పాఠశాలలో పనిచేసే అటెండర్ కన్నేశాడు. మాయమాటలు చెప్పి బాలికను లోబరుచుకున్నాడు. ఇటీవల బాలిక కడుపునొప్పితో బాధపడుతుండగా.. తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

కాగా.. పరీక్షించిన వైద్యులు బాలిక గర్భవతి అని తేల్చారు. దీంతో దీనికి కారణం ఎవరని తల్లిదండ్రులు ఆరాతీయగా.. బాలిక జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఈ విషయాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచి.. బేరసారాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయనట్లు తెలుస్తోంది. పోలీసులకు తెలిస్తే తమ బిడ్డ భవిష్యత్తు, పరువు పోతుందనే భయంతో వాళ్లు బయటకు చెప్పడం లేదని సమాచారం. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!