హైద్రాబాద్‌లో విషాదం: కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురి మృతి

By narsimha lode  |  First Published Jul 29, 2020, 12:37 PM IST

హైద్రాబాద్ లో  కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు.. వీరంతా ఒకే ఆసుపత్రిలో చికిత్స పొందారు . రెండు రోజుల వ్యవధిలో ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో భార్యాభర్తలు మరణించారు.



హైదరాబాద్: హైద్రాబాద్ లో  కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించారు.. వీరంతా ఒకే ఆసుపత్రిలో చికిత్స పొందారు . రెండు రోజుల వ్యవధిలో ఈ ప్రైవేట్ ఆసుపత్రిలో భార్యాభర్తలు మరణించారు. ఇప్పటికే ఆసుపత్రికి రూ. 8 లక్షలు చెల్లించారు బాధిత కుటుంబం. మిగిలిన రూ. 10 లక్షలు చెల్లిస్తే మృతదేహం ఇస్తామని చెప్పడంతో కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

హైద్రాబాద్ పట్టణానికి చెందిన సత్యనారాయణ రెడ్డి కుటుంబంలో ముగ్గురు కరోనాతో మరణించారు. సత్యనారాయణ రెడ్డి బుధవారం నాడు కరోనాతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.ఈ కుటుంబంలో తొలుత సత్యనారాయణ రెడ్డి కొడుకు కరోనా బారినపడ్డాడు. ఆయన సోమాజీగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరాడు. ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించాడు.

Latest Videos

undefined

ఇదే ఆసుపత్రిలో సత్యనారాయణ రెడ్డి భార్య సుహాసిని చేరారు. అయితే ఆమెకు నయమైందని ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. అయితే శ్వాస సంబంధమైన ఇబ్బందుల కారణంగా సుహాసిని ఈ నెల 28వ తేదీన ఆసుపత్రిలో చేరారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది.

10 రోజులుగా ఇదే ఆసుపత్రిలో సత్యనారాయణరెడ్డి ఆసుపత్రిలో చేరాడు. కరోనాకు చికిత్స పొందుతున్నారు. ప్రతి రోజూ రూ. 60వేలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం ఈ కుటుంబానికి చెప్పింది.

also read:రంగారెడ్డిలో పెరుగుతున్న కరోనా: తెలంగాణలో 58 వేలు దాటిన కేసులు

సుహాసిని చనిపోయిన విషయం చెబితే సత్యనారాయణ రెడ్డి ఆరోగ్యం దెబ్బతినే  అవకాశం ఉందని భావించిన  కుటుంబసభ్యులు ఈ విషయాన్ని ఆయనకు చెప్పలేదు. బుధవారం నాడు ఉదయం సత్యనారాయణ రెడ్డి మరణించారు.

అయితే ఆసుపత్రి యాజమాన్యానికి ఇప్పటికే రూ. 8 లక్షలు చెల్లించారు. మరో రూ. 10 లక్షలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం డిమాండ్ చేస్తోంది ఆ కుటుంబం చెబుతుంది. రూ. 10 లక్షలు చెల్లించకపోతే సత్యనారాయణ రెడ్డి డెడ్ బాడీ ఇవ్వమని చెబుుతున్నారని కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని బాధిత కుటుంబం ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

click me!