రంగారెడ్డిలో పెరుగుతున్న కరోనా: తెలంగాణలో 58 వేలు దాటిన కేసులు

By narsimha lode  |  First Published Jul 29, 2020, 10:19 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,764 కొత్త కేసులుు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58,906కి చేరుకొంది.


హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. గత 24 గంటల్లో రాష్ట్రంలో 1,764 కొత్త కేసులుు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 58,906కి చేరుకొంది.

నిన్న ఒక్క రోజే కరోనా సోకిన 842 మంది కోలుకొన్నారు. దీంతో రాష్ట్రంలో కరోనా నుండి కోలుకొన్నవారి సంఖ్య 43,751కి చేరింది. అంతేకాదు గత 24 గంటల్లో  12 మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో కరోనా సోకి మరణించిన వారి సంఖ్య 492గా నమోదైనట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

Latest Videos

undefined

 

తెలంగాణలో కొత్తగా 1764 కరోనా పాజిటివ్ కేసులు... pic.twitter.com/Loz8gUn19b

— Asianetnews Telugu (@asianet_telugu)

రాష్ట్రంలో 14,663 యాక్టివ్ కేసులు రికార్డయ్యాయి. 9,178 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 3,97,939 శాంపిల్స్ సేకరించారు. గత 24 గంటల్లో 18,858 మంది నుండి శాంపిల్స్ సేకరించారు. ఇందులో ఇంకా 788 మంది శాంపిల్స్ కు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది.

గత 24 గంటల్లో ఆదిలాబాద్ లో 15, భద్రాద్రి కొత్తగూడెంలో 30, జీహెచ్ఎంసీలో 509, జగిత్యాలలో 12, జనగామలో 13, జయశంకర్ భూపాలపల్లిలో 08, జోగులాంబ గద్వాల్ లో 22 కేసులు నమోదయ్యాయి.

also read:24 గంటల్లో కరోనాతో 58 మంది మృతి: ఏపీలో మొత్తం 1,10,297కి చేరిక

కామారెడ్డిలో 10, కరీంనగర్ లో93, ఖమ్మంలో69, కొమరం భీమ్ ఆసిఫాబాద్ లో 06, మహబూబ్ నగర్ లో 47, మహబూబాబాద్ లో 09, మంచిర్యాలలో 28, మెదక్ లో 23, మేడ్చల్ మల్కాజిగిరిలో 158, ములుగులో 17, నాగర్ కర్నూల్ లో 29, నల్గొండలో 51, నారాయణపేటలో 07, నిర్మల్ లో 8, నిజమాబాద్ లో47, పెద్దపల్లిలో 44 కేసులు నమోదయ్యాయి.

రాజన్న సిరిసిల్లలో 13,రంగారెడ్డిలో 147, సంగారెడ్డిలో 89, సిద్దిపేటలో 21, సూర్యాపేటలో 38, వికారాబాద్ లో 07, వనపర్తిలో 04, వరంగల్ రూరల్ లో 41, వరంగల్ అర్బన్ లో 138, యాదాద్రి భువనగిరిలో 11 కేసులు నమోదయ్యాయి.
 

click me!