పలు కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతుంది. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కరోనా గ్రామాల్లో కూడా తన పంజా విసురుతోంది తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు
పలు కుటుంబాల్లో కరోనా విషాదాన్ని నింపుతుంది. ఇప్పటి వరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన కరోనా గ్రామాల్లో కూడా తన పంజా విసురుతోంది తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో కరోనాతో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి చెందారు. కామారెడ్డి జిల్లాలో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. వీరిలో ఒకరు మరణించారు.
మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ వ్యాపారి కుటుంబంలో కరోనా విషాదాన్ని నింపింది. 20 రోజుల వ్యవధిలోనే ముగ్గురు కరోనాకు బలయ్యారు. వ్యాపారితో పాటు వ్యాపారి ఇద్దరు కొడుకులు కూడ కరోనా బారిన పడి మరణించారు. మూడు వారాల్లోనే ఒకే కుటుంబంలో ముగ్గురు మరణించడం ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది.
undefined
కరోనాతో ముగ్గురు మరణించడంతో ఆ పట్టణవాసులు భయాందోళనలు చెందుతున్నారు. కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.
మరో వైపు కామారెడ్డి జిల్లాలో కూడ కరోనాతో ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. కామారెడ్డి పట్టణంలో గోపాలస్వామి గుడి రోడ్డులో ఒకే కుటుంబంలో ఆరుగురికి కరోనా సోకింది. కరోనాతో 80 ఏళ్ల వృద్ధురాలు మరణించింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ కూడ ముందుకు రాలేదు. పీపీఈ కిట్స్ తీసుకొని ఆటోలో వృద్దురాలి డెడ్ బాడీని స్మశానం వరకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.