హైదరాబాదుకు వరుస తెరిపి: తెలంగాణలో లక్షా 52 వేలు దాటిన కరోనా కేసులు

Published : Sep 11, 2020, 08:57 AM ISTUpdated : Sep 11, 2020, 08:58 AM IST
హైదరాబాదుకు వరుస తెరిపి: తెలంగాణలో లక్షా 52 వేలు దాటిన కరోనా కేసులు

సారాంశం

తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 52 వేల మార్కు దాటింది. వరుసగా హైదరాబాదులో మాత్రం కరోనా తెరిపినిస్తోంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. హైదరాబాదులో వరుసగా నాలుగో రోజు కరోనా వైరస్ తెరిపినిచ్చింది. రంగారెడ్డి జిల్లాలో మాత్రం స్వల్పంగా కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో తెలంగాణలో 2426 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య తెలంగాణలో లక్షా 52 వేల 602కు చేరుకుంది.

గత 24 గంటల్లో తెలంగాణలో కరోనా వైరస్ తో 13 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కరోనా మరణాల సంఖ్య తెలంగాణలో 940కి చేరుకుంది.గత 24 గంటల్లో కరోనా వ్యాధి నుంచి 2324 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య లక్షా 19 వేల 467కు చేరుకుంది. ఇంకా 32195 మంది ఆస్పత్రుల్లో కరోనా వైరస్ రోగానికి చికిత్స పొందుతున్నారు.

గత 24 గంటల్లో హైదరాబాదులో 338 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 216 కరోనా కేసులు రికార్డయ్యాయి. నల్లగొండ జిల్ాలలో 164 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో తెలంగాణలో జిల్లాలవారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఇలా ఉంది.

ఆదిలాబాద్ 25
భదాద్రి కొత్తగూడెం 67
జిహెచ్ఎంసీ 338
జగిత్యాల 62
జనగామ 33
జయశంకర్ భూపాలపల్లి 22
జోగులాంబ గద్వాల 32
కామారెడ్డి 54
కరీంనగర్ 129
ఖమ్మం 98
కొమరంభీమ్ ఆసిఫాబాద్ 15
మహబూబ్ నగర్ 46
మహబూబాబాద్ 76
మంచిర్యాల 57
మెదక్ 42
మేడ్చెల్ మల్కాజిగిరి 172
ములుగు 16
నాగర్ కర్నూలు 50
నల్లగొండ 164
నారాయణపేట 14
నిర్మల్ 32
నిజామాబాద్ 89
పెద్దపల్లి 56
రాజన్న సిరిసిల్ల 41
రంగారెడ్డి 216
సంగారెడ్డి 97
సిద్ధిపేట 87
సూర్యాపేట 78
వికారాబాద్ 11
వనపర్తి 38
వరంగల్ రూరల్ 18
వరంగల్ అర్బన్ 108
యాదాద్రి భువనగిరి 43

 

PREV
click me!

Recommended Stories

హైదరాబాద్ టు థాయిలాండ్ విమానానికి ప్రమాదం.. ఒక్కసారిగా ఊడిన టైర్, హార్డ్ ల్యాండింగ్
Shiv Pratap Shukla Takes Oath As Telangana Governor At Lok Bhavan, Hyderabad | Asianet News Telugu