నారాయణపేట జిల్లాలో పుట్టి మునక,ఐదుగురి గల్లంతు

By narsimha lodeFirst Published Aug 17, 2020, 4:57 PM IST
Highlights

నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం వల్లభాపురంలో పుట్టి మునిగి ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలను చేపట్టారు అధికారులు.

నారాయణపేట జిల్లాలోని మక్తల్ మండలం వల్లభాపురంలో పుట్టి మునిగి ఐదుగురుగల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలను చేపట్టారు అధికారులు.


మండలంలోని కురుబాపురం గ్రామానికి చెందిన 9 మంది సోమవారం నాడు పుట్టిలో మక్తల్ కు వచ్చారు. మక్తల్ లో సంతలో తమకు కావాల్సిన నిత్యావసర సరుకులను తీసుకొన్నారు.

తిరిగి కురుబాపురం వెళ్లే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ప్రమాదం జరిగిన సమయంలో పుట్టిలో మొత్తం 9 మంది ఉన్నారు. వీరిలో నలుగురు పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. మహిళల్లో ముగ్గురు పెద్దవాళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగా స్థానికులు చెబుతున్నారు.

మక్తల్ నుండి కురుబాపురం వెళ్లాలంటే కృష్ణానదిని పుట్టిమీద దాటాల్సిందే. కురుబాపురంలో ప్రఖ్యాతిచెందిన దత్తాత్రేయస్వామి ఆలయం కూడ ఉంది. ఇక్కడికి చేరుకోవాలంటే పుట్టి మీద ప్రయాణం చేయాల్సిందే.

ప్రతి రోజూ మాదిరిగానే వీరంతా పుట్టిలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.వరద ఉధృతికి పుట్టిలోని ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారంతా మహిళలేనని స్థానికులు చెబుతున్నారు.

 

click me!