వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Published : Jul 13, 2022, 01:21 PM IST
వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

సారాంశం

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. జిల్లాలోని పూడూరులో ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

వికారాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. వివరాలు.. జిల్లాలోని పూడూరులో ఉన్న స్టీల్‌ ఫ్యాక్టరీ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. మరి కొందరు గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను జహిరాబీ (68), జావెద్‌ (12), ఉమర్‌ (6)లుగా గుర్తించారు. 

మృతులు పరిగి మండలం సుల్తాన్ పూర్‌లో ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి వాహనంపై నియంత్రణ కోల్పోయి ముందు వెళుతున్న లారీని వెనకాల నుంచి ఢీకొట్టినట్లు తెలుస్తోంది. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే