ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మత్తడి ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి.దిగువకు నీరు విడదల అవుతుంది.
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మత్తడి ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకుపోయాయి. ఈ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు రావడంతో ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయి. ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడంతో దిగువకు నీరు భారీగా వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోవడంతో దిగువ ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మత్తడి ప్రాజెక్టు గేట్లు వరద నీటిలో కొట్టుకుపోయాయని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది. అయితే ఎన్ని గేట్లు కొట్టుకుపోయాయనే విషయమై పూర్తి సమాచారం మాత్రం ప్రసారం చేయలేదు.గేట్లు కొట్టుకుపోవడంతో వరద నీరు భారీగా కిందకు వస్తున్నట్టుగా ఆ చాానెల్ ప్రసారం చేసిన కథనంలో తెలిపింది.
277.00 మీటర్లు మత్తడి వాగు పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం. అయితే పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో ఈ ప్రాజెక్టు గేట్లు ఈ వరద నీటిని ఆపలేకపోయాయి. వరద ఉధృతికి గేట్లు కొట్టుకుపోవడంతో సమీప గ్రామాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పెన్ గంగా బేసిన్ లో ఈ ప్రాజెక్టు ఉంది. గోదావరికి పెన్ గంగ ఉప నది., గోదావరితో పాటు దాని ఉప నదులకు భారీగా వరద వచ్చి చేరుతుంది.