సిద్దిపేట జిల్లాలో కారు, లారీ ఢీ: ముగ్గురు మృతి

By narsimha lode  |  First Published Jun 12, 2022, 11:39 AM IST


సిద్దిపేట జిల్లాలోని చిన్నకోడూరు మండలం మల్లారం వద్ద ఆదివారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. కారు, లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది.


సిద్దిపేట: జిల్లాలోని Chinnakodur మండలం Mallaram వద్ద కారు, లారీ ఢీకొన్న  Road Accidentలో ముగ్గురు మరణించారు.  ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. మృతులు సిరిసిల్లకు చెందిన తాండ్ర పాపారావు, ఆయన భార్య పద్మ, డ్రైవర్ ఆంజనేయులుగా పోలీసులు గుర్తించారు.  పాపారావు రిటైర్డ్ టీచర్. కరీంనగర్ నుండి హైద్రాబాద్ లో కారులో వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

మద్యం మత్తులో లారీ డ్రైవర్ ఈ ప్రమాదానికి కారణమైనట్టుగా పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్ నుండి లారీ కరీంనగర్ వైపునకు వస్తున్న సమయంలో మల్లారం వద్ద ఈ ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో డ్రైవర్ లారీని అజాగ్రత్తగా నడపడం వల్ల  డివైడర్ ను ఢీకొని మరో రోడ్డులో వస్తున్న కారును ఢీకొట్టింది.

Latest Videos

undefined

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు చోట్ల ఇటీవల కాలంలో  రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. ఈ నెల 9వ తేదీన యాదాద్రి జిల్లా వలిగొండ మండలం టేకులసోమారం గ్రామానికి చెందిన దండెబోయిన నర్సింహ, రాజ్యలక్ష్మి భార్యాభర్తలు. బొమ్మలరామారం మండలం చౌదరిపల్లిలో వీరి బంధువు చనిపోవడంతో భార్యతో పాటు వదిన జంగమ్మను తీసుకుని నర్సింహ బైక్ పై బయలుదేరాడు. 

 భువనగిరి పట్టణ సమీపంలోని హనుమపూర్ బచ్పన్ స్కూల్ వద్ద వీరు ప్రయాణిస్తున్న బైక్ ను అతివేగంతో వచ్చిన డిసిఎం ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న నర్సింహతో పాటు వెనకాల కూర్చున్న ఇద్దరు మహిళలు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి రోడ్డుపై రక్తపుమడుగులో పడిపోయారు. తీవ్ర గాయాలతో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 

జనగామ జిల్లాలో ఈ నెల 5న  రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఓ టవేరా వాహనం అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టవేరాలో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, అటుగా వెళ్తున్నవారు.. గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

also read:బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు చెరువులో పడి 8 మంది దుర్మరణం..

రోడ్డు ప్రమాదంతో  ఈ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు టవేరాను రోడ్డుపై నుంచి తొలగించి రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. అదే రోజున ములుగు జిల్లా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. ఏటూరునాగారం వద్ద జాతీయ రహదారిపై కారును ఇసుక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరొరకరి పరిస్థితి విషమంగా ఉంది

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్  మండలం అలీ రాజ్ పేట్ బ్రిడ్జి వద్ద ఈ ఏడాది మే 27న రోడ్డు ప్రమాదం జరిగింది. జగదేవ్ పూర్ మండలానికి చెందిన ఓ కుటుంబం ఆటోలో మెదక్ వెళ్తోంది.  ఆటోకి ఎదురుగా వస్తున్న లారీని  ఢీకొంది.  ఆటోలో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.  తీవ్రగాయాలైన నలుగురిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మార్గమధ్యలో మరణించారు.  మిగిలిన వారిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబంలో నలుగురు చనిపోవడంతో జగదేవ్పూర్ లో విషాదఛాయలు అలముకున్నాయి. 

కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండలంలో మే 26న రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.   చల్లపల్లి మండలంలోని చింతమడ నుంచి పెళ్లి బృందం మోపిదేవి మండలం పెడప్రోలు గ్రామంలో జరుగుతున్న పెళ్లి వేడుకలకు  బయలుదేరింది. అయితే వారు ప్రయాణిస్తున్న వాహనం మోపిదేవి మండలం కాశా నగర్ వద్ద వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. 

ఈ ప్రమాదంలో నలుగురు ఘటన స్థలంలోనే మృతిచెందారు. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని అవనిగడ్డ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పరామర్శించారు. 

ప్రమాదం జరిగిన సమయంలో పెళ్లి బృందం వాహనంలో 20 మందికి పైగా ఉన్నారు. పరిమితికి మించి వాహనంలో ప్రయాణిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

click me!