రైల్వేలో ఉద్యోగాల పేరుతో రూ. కోటి వసూలు: ముగ్గురిని అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు

By narsimha lodeFirst Published Jan 26, 2022, 9:45 AM IST
Highlights

రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుండి కోటి రూపాయాలను స్వాహా చేసిన నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్ చేసినట్టుగా రాచకొండ పోలీసులు తెలిపారు. నేరేడ్ మెట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీపీ మహేష్ భగవత్ ఈ  కేసు వివరాలను వెల్లడించారు.

హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ డబ్బులు వసూలు చేసిన ముగ్గురిని  Hyderabad పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితులు సుమారు కోటిన్నరను వసూలు చేశారని పోలీసులు గుర్తించారు.  

Rachakonda సీపీ Mahesh Bhagwat  మంగళవారం నాడు నేరేడ్ మెట్ పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో సురేంద్ర అలియాస్ పుట్టా సురేష్ కుమార్ రెడ్డి, దాచిపల్లి సరేష్, బానోతు నాగలక్ష్మిలను అరెస్ట్ చేసినట్టుగా ఆయన చెప్పారు. కాకరపర్తి భాగ్యలక్ష్మి, ఆలం శ్రీనివాస్ ల కోసం గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు చెప్పారు.

Khammam జిల్లా మధిర గ్రామానికి చెందిన కాకరపర్తి Surendra ఈ కేసులో ప్రధాన నిందితుడని సీపీ చెప్పారు. పదో తరగతి వరకు చదువుకొని ప్రైవేట్ ఉద్యోగం చేసేవాడు. అదే సమయంలో బంగారం బిస్కెట్లను తక్కువ ధరకు ఇప్పిస్తానని స్నేహితుల వద్ద రూ 12 లక్షలను వసూలు చేసిన ట్టుగా ఆయనపై కేసు నమోదైందని సీపీ మహేష్ భగవత్ గుర్తు చేశారు. 2013లో ఉప్పల్ లో క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని చెప్పారు. క్యాబ్ డ్రైవర్ గా పనిచేసే సమయంలో తన పేరును Putta Suresh Reddy గా మార్చుకొన్నాడు. నకిలీ ఆధార్ కార్డు,  ఓటరు గుర్తింపు కార్డును ఇదే పేరుతో తెచ్చుకొన్నాడని సీపీ తెలిపారు. 

భార్య నాగలక్ష్మితో పాటు అతని సహాయకుడు దాచేపల్లి సురేష్ లతో కలిసి మోసాలకు పాల్పడినట్టుగా ఆయన చెప్పారు.రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసినట్టుగా సీపీ వివరించారు.  ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరావు, సికింద్రాబాద్ కు చెందిన ఆలంతో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిందితుడు ప్రచారం చేయించినట్టుగా తమ దర్యాప్తులో తేలిందన్నారు.  ఆలం శ్రీనివాసరావును రైల్వే ఉద్యోగిగా పరిచయం చేసి నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేశారని పోలీసులు చెప్పారు. 

ఒక్కో నిరుద్యోగి నుండి రూ. 5 నుండి రూ. 10 లక్షలు వసూలు చేశారు.కొందరికి నకిలీ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చారు. ఈ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ తీసుకొని ఉద్యోగంలో చేరేందుకు వెళ్లిన బాధితులకు తాము మోసపోయామని గుర్తించారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదుల ఆధారంగా మల్కాజిగిరి పోలీసులు సురేంద్ర అలియాస్ పుట్టా సురేష్ కుమార్ రెడ్డిని arrestచేసినట్టుగా పోలీసులు చెప్పారు. 

నిరుద్యోగుల నుండి వసూలు చేసిన డబ్బులతో కార్లను కొనుగోలు చేసి ఉప్పల్ లో ట్రావెల్స్, సెక్యూరిటీ సంస్థను ప్రారంభించాడు. అంతేకాదు Mahabubunagar జిల్లా జడ్చర్లలో క్యాంటిన్ ను తెరిచాడు. బోడుప్పల్ వద్ద రూ. 40 లక్షలతో భూమిని కొనుగోలు చేశాడని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు.
 

click me!