పంట రాక, అప్పులు తీర్చలేక.. ముగ్గురు రైతుల బలవన్మరణం...

By SumaBala Bukka  |  First Published Jan 27, 2022, 9:32 AM IST

అప్పులు తీర్చే దారిలేక మంగళవారం సెంట్రింగ్ కూలీ పనికి వెళ్తున్నానని భార్యతో చెప్పి బయటకు వెళ్ళాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. బుధవారం గ్రామానికి సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ  సదానందం తెలిపారు


నర్మెట : అప్పుల బాధతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ముగ్గురు farmers suicideలకు పాల్పడ్డారు. వేసిన పంట నష్టపోగా, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో మీరు బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ కౌలు రైతు ఉన్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేటలో నూనె రాజశేఖర్ (28) రెండు ఎకరాల్లో పత్తి సాగు చేయగా, పంట దిగుబడి ఆశించిన మేర రాలేదు. గతంలో పంటసాగు కోసం చేసిన debtతో పాటు తాజా మూడు లక్షలకు చేరుకుంది.

దీనికితోడు ఇటీవల రాజశేఖర్ కు ఆపరేషన్ జరిగింది. ఇందుకోసం మరో రెండు లక్షలు ఖర్చు అయ్యాయి. దీంతో అప్పులు తీర్చే దారిలేక మంగళవారం సెంట్రింగ్ కూలీ పనికి వెళ్తున్నానని భార్యతో చెప్పి బయటకు వెళ్ళాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. బుధవారం గ్రామానికి సమీపంలో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ  సదానందం తెలిపారు.

Latest Videos

undefined

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఎర్ర చక్రుతండాకు చెందిన జాటోతు బొడ్యా (55)  తనకున్న ఎకరం భూమిలో మిరప సాగు చేశాడు. సుమారు లక్షన్నర పెట్టుబడి పెట్టాడు. పంట అమ్మడంతో పదిహేను వేలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు కూతురు వివాహానికి రూ.4.5 లక్షలు అప్పు చేశాడు. దీంతో అప్పు తీర్చే దారి లేక మనస్తాపంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  మృతుడికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.

రూ. 10 లక్షలు అప్పు తీర్చలేక..
భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబట్ పల్లికి చెందిన పుట్ట రవి(38)  తనకు ఉన్న ఎకరంతో పాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశాడు. కౌలు కోసం రూ.30 వేలతో పాటు పంట సాగుకు ఇప్పటివరకు దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. కాగా ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తోడు తెగుళ్లు సోకి పంట పూర్తిగా నాశనమైంది. దీంతో మనోవేదనకు గురైన రవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజ్ కుమార్ తెలిపారు. 

ఇదిలా ఉండగా, జనవరి 22న ఆత్మహత్య చేసుకునేందుకు తనకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ నల్గొండ జిల్లా కనగల్ మండలంలో ఎడవెల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను అనే రైతు మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్‌లకు లేఖ రాశాడు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడినని శ్రీను లేఖలో ఆయన తెలిపారు.

అయితే పల్లె ప్రకృతి వనానికి తన భూమిని తీసుకున్నారని... కొంత భూమిని గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కోసం సేకరించారని చెప్పారు. ఇంజినీరింగ్ చదివిన తనకు ఎలాంటి ఉద్యోగమూ లేదని... దీంతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను రోడ్డున పడ్డానని, జీవనం దుర్భరంగా ఉందని, తాను చనిపోయేందుకు అనుమతించాలని శ్రీను కోరారు. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు, కనగల్ తహసీల్దార్‌కు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

click me!