సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రమాదం: మట్టి పెళ్లలు పడి ముగ్గురు మృతి

Published : Feb 23, 2020, 08:35 AM IST
సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రమాదం: మట్టి పెళ్లలు పడి ముగ్గురు మృతి

సారాంశం

కుమ్రం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో శనివారం నాడు రాత్రి ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 


కాగజ్‌నగర్: కుమ్రం భీమ్ జిల్లా ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పేపర్ మిల్లులో శనివారం నాడు రాత్రి ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. 

పేపర్ మిల్లులో విద్యుత్ ప్లాంట్ కోసం జరుగుతున్న బాయిలర్ నిర్మాణం పనుల్లో ఒక్కసారిగా మట్లి దిబ్బలు మీదపడ్డాయి. దీంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు.  ఒక్కో షిఫ్టులో సుమారు 12 మంది కార్మికులు ఈ ప్రదేశంలో పనిచేస్తున్నారని స్థానికులు చెప్పారు.

సంఘటన జరిగిన సమయలో ఎంత మంది కార్మికులు ఉన్నారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మృతి చెందిన వారు ఇతర రాష్ట్రాలకు చెందినవారుగా  స్థానికులు అనుమానిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?
Telangana Rising 2047: చైనాలోని ఆ నగరంలా తెలంగాణ.. సీఎం రేవంత్ కొత్త ఫార్ములా