చెరువులోకి దూసుకెళ్లిన కారు.. సర్పంచి భర్త సహా ముగ్గురు మృతి

Published : Feb 22, 2020, 01:39 PM ISTUpdated : Feb 22, 2020, 01:58 PM IST
చెరువులోకి దూసుకెళ్లిన కారు.. సర్పంచి భర్త సహా ముగ్గురు మృతి

సారాంశం

మృతులు సర్నేనిగూడెం సర్పంచ్ భర్త మధు, కొడుకు మణికంఠ, కారు డ్రైవర్ శ్రీధర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిస్తామని ముగ్గురూ కారులో వెళ్లారు. ఆచూకీ కోసం గాలిస్తుండగా వీరి కారు చెరువులో కనిపించింది


చెరువులోకి కారు దూసుకెళ్లి ముగ్గురు మృతి చెందిన ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... రామన్నపేట మండలం వెల్లంకి చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. 

Also Read అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని కొడుకుని చంపేసి గోనెసంచీలో మూట కట్టింది...

మృతులు సర్నేనిగూడెం గ్రామ సర్పంచ్ భర్త మధు, కొడుకు మణికంఠ, కారు డ్రైవర్ శ్రీధర్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. నిన్న సాయంత్రం వ్యవసాయ బావి వద్దకు వెళ్లిస్తామని ముగ్గురూ కారులో వెళ్లారు. ఆచూకీ కోసం గాలిస్తుండగా వీరి కారు చెరువులో కనిపించింది. కారుతో పాటు మృతదేహాలను వెలికితీశారు. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య దగ్గర ఉండి పర్యవేక్షిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


కాగా.. కరీంనగర్ లో ఇటీవల ఓ ఎమ్మెల్యే సోదరి కుటుంబం కూడా ఇలానే నీటిలో కారుపడి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. 

PREV
click me!

Recommended Stories

Air Pollution : హైదరాబాద్ మరో డిల్లీ అవుతోందా..! ఈ ప్రాంతాల్లో మరీ ఇంత కాలుష్యమా..!!
Hyderabad: ఇప్పుడే కొనేయండి.. హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం మ‌రో మాదాపుర్ కావ‌డం ఖాయం