కరీంనగర్ :హోలీ పండుగ నాడు విషాదం.. మానేరు నదిలో మునిగి ముగ్గురు బాలురు మృతి

Siva Kodati |  
Published : Mar 07, 2023, 06:43 PM ISTUpdated : Mar 07, 2023, 06:44 PM IST
కరీంనగర్ :హోలీ పండుగ నాడు విషాదం.. మానేరు నదిలో మునిగి ముగ్గురు బాలురు మృతి

సారాంశం

కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్ వాటర్‌లో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. మృతులను వీరాంజనేయులు (16), సంతోష్ (13), అనిల్ (14)గా గుర్తించారు.

హోలీ పండుగ నాడు కరీంనగర్ జిల్లా అలుగునూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మానేరు రివర్ ఫ్రంట్ వాటర్‌లో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా కరీంనగర్ హౌసింగ్ బోర్డు కు చెందిన వారు. మంగళవారం హోలీ వేడుకల్లో పాల్గొని అనంతరం మానేరు రివర్ ఫ్రంట్ నీటిలో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు మృతి చెందారు. వీరంతా  ప్రకాశం జిల్లా చీమకుర్తిగా చెందిన వారిగా తెలుస్తుంది. మృతుల తల్లిదండ్రులు వలసకూలీలుగా జీవనం సాగించేవారని సమాచారం. మృతులను వీరాంజనేయులు (16), సంతోష్ (13), అనిల్ (14)గా గుర్తించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. ఒకేసారి ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోవడంతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?