హైద్రాబాద్‌లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ: ముగ్గురు అరెస్ట్, మరో ఎనిమిది మంది పరారీ

Published : Aug 25, 2023, 10:46 AM ISTUpdated : Aug 25, 2023, 10:47 AM IST
హైద్రాబాద్‌లో  నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ: ముగ్గురు అరెస్ట్, మరో ఎనిమిది మంది పరారీ

సారాంశం

హైద్రాబాద్ లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఎనిమిది మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.


హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్‌ ఉప్పర్‌పల్లిలో  నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను  ఎస్ఓటీ పోలీసులు శుక్రవారంనాడు అరెస్ట్ చేశారు. కచ్చితమైన సమాచారం మేరకు   ఇవాళ  ఉదయం పోలీసులు నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్  తయారు చేస్తున్న గోడౌన్ పై దాడి చేశారు. ఈ పేస్ట్ తయారు చేస్తున్న వారిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న వారి కోసం  ఎస్ఓటీ పోలీసులు  గాలింపు చర్యలు చేపట్టారు.

హైద్రాబాద్ నగరంలో  గతంలో కూడ  నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న ముఠాను  పోలీసులు అరెస్ట్  చేసిన ఘటనలున్నాయి. ఈ నెల  21న  ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కులకచర్లలో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న  ఇద్దరిని  అరెస్ట్  చేశారు

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక తెలంగాణలో 5°C టెంపరేచర్స్.. ఈ ఏడు జిల్లాలకు రెడ్ అలర్ట్
School Holidays : వచ్చే బుధ, గురువారం స్కూళ్లకు సెలవేనా..?