భద్రాచలంలో ఇవాళ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు భద్రాచలం ఆలయానికి చేరుకున్నారు.
ఖమ్మం: భద్రాచలంలో సీతారాముల కళ్యాణం గురువారంనాడు అత్యంత వైభవంగా నిర్వహించారు. సీతారాముల స్వామి వారి కళ్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలను సమర్పించారు.
సీతారాముల కళ్యాణోత్సవం కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీలు రవిచంద్ర, కవిత తదితరులు పాల్గొన్నారు.
undefined
సీతారాముల కళ్యాణోత్సవాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తుల కోసం అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. 10 అడ్డూ కౌంటర్లు, 70కి పైగా తలంబ్రాల కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణోత్సవం కోసం 12 నదులు, 4 సముద్రాల నుండి నీరు తెప్పించారు. 36 సెక్టార్లుగా మిథిలా స్టేడియాన్ని విభజించారు. రేపు శ్రీరాముడి పట్టాభిషేకాన్ని మిథిలా స్టేడియంలో నిర్వహించనున్నారు.
సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో సాగుతుంది. గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఆంక్షల మధ్య సీతారాముల కళ్యాణోత్సవం నిర్వహించారు. కరోనా ప్రభావం తగ్గడంతో ఈ దఫా సీతారాముల కళ్యాణానికి ఎలాంటి ఆంక్షలు లేవు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చారు.
భద్రాచలం ఆలయంలో సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయాలను మంజూరు చేసింది.
ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు దేశ వ్యాప్తంగా లక్ష మంది భక్తులు హాజరౌతారని అంచనా వేశారు. అధికారులు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేశారు. మిథిలా స్టేడియాన్ని పూలతో అలంకరించారు. 32 వేల మంది కూర్చొనే సామర్ధ్యం ఉన్న మిథిలా స్టేడియాన్ని 26 సెక్టార్లుగా విభజించారు. కళ్యాణమండపంలోకి ప్రవేశించేందుకు ఎనిమిది ఎంట్రీ పాయింట్లను ఏర్పాటు చేశారు.
భక్తులకు పంచేందుకు రెండు లక్షల లడ్డూలను ఆలయ అధికారులు సిద్దం చేశారు. వేసవిని పురస్కరించుకుని భక్తులకు తాగు నీటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. మూడు లక్షల తాగునీటి ప్యాకెట్లును అందుబాటులో ఉంచారు. కళ్యాణాన్ని భక్తులు తిలకించేలా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం తాత్కాలికంగా 300 బాత్ రూమ్స్ , టాయిలెట్స్ ను కూడా ఏర్పాటు చేశారు.