డ్రోన్‌తో యాదాద్రి ఆలయం చిత్రీకరణ: పోలీసుల అదుపులో ఇద్దరు

Published : Mar 30, 2023, 09:50 AM IST
డ్రోన్‌తో  యాదాద్రి ఆలయం చిత్రీకరణ: పోలీసుల అదుపులో  ఇద్దరు

సారాంశం

యాదాద్రి  ఆలయాన్ని  అనుమతి లేకుండా  డ్రోన్ ద్వారా చిత్రీకరిస్తున్న  ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

యాదగిరిగుట్ట: యాదాద్రి  భువనగరి జిల్లాలోని  యాదాద్రి  ఆలయాన్ని అనుమతి  లేకుండా   డ్రోన్ ద్వారా చిత్రీకరిస్తున్న  ఇద్దరు  యువకులను  పోలీసులు అదుపులోకి తీసుకుని  ప్రశ్నిస్తున్నారు.  

యాదాద్రి ఆలయాన్ని డ్రోన్ తో చిత్రీకరిస్తున్న విషయాన్ని గుర్తించిన  ఆలయ సిబ్బంది  స్థానిక పోలీసులకు సమాచారం  ఇచ్చారు.ఈ సమాచారం ఆధారంగా  ఆలయం వద్దకు  చేరుకున్న పోలీస్ సిబ్బంది  ఇద్దరు  యువకులను  అదుపులోకి తీసుకున్నారు. హైద్రాబాద్ జీడిమెట్లకు  చెందిన  సాయికిరణ్,  జాన్ లు  డ్రోన్ ద్వారా యాదాద్రి ఆలయాన్ని  చిత్రీకరిస్తున్నారని  పోలీసులు గుర్తించారు. అనుమతి లేకుండా యాదాద్రి  ఆలయాన్ని  డ్రోన్ ద్వారా  చిత్రీకరించడంపై  పోలీసులు  యువకులను  ప్రశ్నిస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్