బిఇడి సర్టిఫికెట్ అమ్ముత... ఎవలైన కొంటరా ?

First Published Dec 2, 2017, 10:56 AM IST
Highlights
  • ఎవరు కొనకపోతే.. యూనివర్శిటీకి వాపస్ ఇస్తా
  • తెలంగాణ సర్కారు నా జీవితం ఆగం చేసింది
  • అమ్మ కష్టపడి చదివించిన చదువుకు అర్థం లేకుండాపోయింది

తెలంగాణలో నిరుద్యోగుల కష్టాలు కండ్లకు కట్టే సంఘటన ఇది. తెలంగాణ సర్కారు నిరుద్యోగులను పట్టించుకోకుండా వారి జీవితాలతో చెలగాటమాడుతుందనడానికి నిదర్శనం. మూడున్నరేళ్లుగా డిఎస్సీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన టీచర్ అభ్యర్థి ఆవేదన ఇది. సర్కారు వారు, టిఎస్పిఎస్సీ వారు పెట్టే నిబంధనలతో తన జీవితం ఆగమైపోయిందని తల్లిడిల్లిన ఓ నిరుద్యోగి బాధ ఇది. తన తల్లి కష్టపడి చదివించిన బిఇడి చదువు బువ్వ పెట్టదని తేలిపోయిన క్షణం. ఆ నిరుద్యోగి తన బిఇడి సర్టిఫికెట్ ను అమ్మకానికి పెట్టిన వేళ... తెలంగాణ నిరుద్యోగి అశోక్ తన ఫేస్ బుక్ పేజీలో రాసుకున్న లేఖ... ఇది.

ఇది నా బీఈడీ సర్టిఫికేట్.. అమ్ముతాను..ఎవరైనా కావాలంటే చెప్పండి ఇస్తా.. మీరిచ్చిన డబ్బు సీఎం రిలీఫ్ ఫండ్ కి donate చేస్తా ...తెలంగాణ ప్రభుత్వం దీనితో నాకు ఏమి ఉపయోగం లేకుండా చేసింది..మా అమ్మ నన్ను ఎంతో కష్టపడి చదివించింది..నేను బీఈడీ చదివే రోజుల్లో నాకు ఫీజు రీయింబర్స్ కూడా రాలేదు..మంచి ర్యాంక్ తో సొంత డబ్బులతో ఫీజు కట్టి చదువుకున్నా పంతులు ఉద్యోగం కొలువు చేద్దామని..మంచిగ పూర్తి చేసిన..ఇక పంతులు కొలువు ఎప్పుడెప్పుడు సాధిద్దామా అని ఎదురుచూసిన..అప్పుడు టెట్ అని ఇంకో మెలిక పెట్టిర్రు..దాంట్లో 60%మార్కులు రావలంట..సరే అదికూడా చదివిన 72% మార్కులు తెచ్చుకున్న..2012 dsc రాసిన 72 మార్కులు వచ్చినాయి..ఉద్యోగం రాలే..

అప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతుంది..ఉమ్మడి Ap ప్రభుత్వం మరో Dsc నోటిఫికేషన్ కి సిద్ధపడింది..మా తెలంగాణ లో మేమేసుకుంటం అని ఉద్యమంలో పోరాడి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నం.. ఎప్పుడెప్పుడు dsc నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూసినం...మూడేళ్లకు కానీ మన ప్రభుత్వానికి మూడ్ రాకపాయే..సరే ఇప్పుడు వచ్చింది.మన ప్రభుత్వంలో పంతులు కొలువుకోసం చదువుతున్న. కానీ మన ప్రభుత్వం డిగ్రీ లో 50% మార్కులు ఉంటేనే exam రాయాలని మెలిక పెట్టింది. నేనెప్పుడో 2008 లో డిగ్రీ పూర్తి చేసిన..నాకు 48.25% మార్కులు వచ్చాయి..అప్పుడే బీఈడీ కి అర్హత లేదంటే వేరేది చదువుకొనే వాడిని.. బీఈడీ చేసి 2 సార్లు టెట్ రాసి, ఒకసారి dsc రాస్తే...ఇప్పుడు నేను అర్హుడిని కాదంట.. ఇదెంత వరకు న్యాయమో మీరే చెప్పండి..

36% మార్కులు వచ్చిన వాడు కలెక్టర్ అవ్వచ్చు..గ్రూప్ 1 & 2 ఎంప్లాయీస్ అవ్వచ్చు.. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన నాకు అర్హత లేదంటారా.మరి పక్కనున్న Ap dsc lo అందరికీ అవకాశం ఇచ్చింది.. నాకు PG లో 75% మార్కులున్నయి..నేను అర్హుడుని కాదా..కనీసం ప్రైవేట్ టీచర్ గా కూడా పనికిరానని మన ప్రభుత్వం certifie చేసింది నన్ను...అలాంటప్పుడు ఎందుకు నాకీ మెమో.. ప్లీజ్ ఎవరైనా కొనండి నా మెమో..నా మీద జాలి తో అయిన...ఆ డబ్బు కచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇస్తా...నేను ఇప్పటికీ రెండు PG లు చేసా...ఆ మెమోలు కావాలన్న ఇస్తా...ఎవ్వరూ కొనకపోతే కోదండరాం సార్ సమక్షంలో యూనివర్సిటీ వారికి రిటర్న్ చేస్తా...నేను ఎవ్వరి మీద కోపంతో ఈ మాటలు చెప్పట్లేదు...ఒక నిరుద్యోగిగా...నా బాధ చెప్పుకున్నా...

click me!