ఈ బైక్ మీద ఒక విఐపి ఉన్నాడు, గుర్తుపట్టండి

First Published May 12, 2017, 10:37 AM IST
Highlights

ఈ పోటో లో బైకు వెనక కూర్చున్న మనిషిని గుర్తుపట్టడం కష్టం. ఆయనొక తెలంగాణా ప్రజాప్రతినిది. ఎలాంటి భేషజం లేకుండా బైకు పిలియన్ రైడ్ చేస్తూ ప్రజలున్న చోటికల్లా పోతుంటాడు. జనం పెద్ద ఎత్తున  వచ్చి స్వాగతం చెప్పాలనుకోడు. ‘నాయకత్వం వర్థిల్లాలి’ అరవాలనుకోడు.  ప్రజలూ ఆయన్ని తమలోని వాడిగానే తప్ప ముఖ్యఅతిధిగా ఎపుడూ చూడరు.ఆయన పేరేమిటో తెలుసా? 

ఈ రోజుల్లో ప్రజాప్రతినిధి అంటే ఎంత హంగు అర్భాటం ఉంటుందో వేరే చెప్పనవసరం లేదు. పే... ద్ద వాహానాలు, సెక్యూరిటీ గార్డులు, మంది మార్బలం. వీళ్లెక్కడున్నా గోల గోలే. అలా  లేకుంటే ప్రజాప్రతినిధిగా పైకి రానట్లే లెక్క. అతన్ని జనమూ పెద్దగా లెక్క చేయరు. వచ్చే ఎన్నికలకు పనికిరాడని నాయకత్వం పక్కన పెట్టే ప్రమాదం ఎక్కువ.  ఈ రోజుల్లో  వీళ్లే ఎక్కువ. వాళ్లదే హవా. గెల్చినప్పటినుంచి అంతా పోటీ పడి పైకొచ్చే పనులు చేస్తూ ఉంటారు.

 

అయితే, మరొక రకం ప్రజా ప్రతినిధులున్నారు, వాళ్లని చెబితే గాని గుర్తుపట్టలేం. జనంలో జనంలాగాకలసిపోతారు. నీళ్లలో చేపంత సహజంగా తిరుగుతుంటారు. సందులు గొందుల్లో తారసపడుతూంటారు.  వీళ్లని ప్రజలు నుంచి వేరు చేసి చూడటం కష్టం... ఇలా పై ఫోటో లో ఉన్న పిలియన్ రైడర్ లా. 

 

ఈ పోటో లో బైకు వెనక కూర్చున్న పెద్ద మనిషిని గుర్తుపట్టడం కష్టం. ఆయనొక ప్రజాప్రతినిది. పేరు సున్నం రాజయ్యం. ఎలాంటి భేషజం లేకుండా బైకు పిలియన్ రైడ్ చేస్తూ ప్రజలున్న చోటికల్లా పోతుంటాడు. జనం పెద్ద ఎత్తున  వచ్చి తనకు స్వాగతం చెప్పాలనుకోడు. ప్రజలూ ఆయనను తమలోని వాడిగానే తప్ప ముఖ్యఅతిధిగా ఎపుడూ చూడరు.

 

సున్నం రాజయ్య సిపిఎం పార్టీ భద్రాచలం ఎమ్మెల్యే. అందునా మూడోసారి.

 

కోయ తెగ వాడు. అసెంబ్లీ చాలా మందికి అదృష్టదేవత. దాని గుమ్మం తొక్కినప్పటినుంచి సిరులుపండుతూఉంటాయి. కాని సున్నం రాజయ్య  అసెంబ్లీ కంటే భద్రాచలమే ఎక్కువనుకుంటాడు. అందుకే  సమీపంలోని సమావేశాలు నడుస్తూ పోతాడు. దూరమయితే, స్కూటర్ మీద అటోలోనో వెళ్తాడు. ఎవరయిన కారెక్కవయ్యా అంటే సిగ్గుపడుతూ ఎక్కుతాడు.

 

ఇలాంటోళ్లను అసెంబ్లీ గేటు దగ్గిర గుర్తుపట్టడం కష్టం. కనీసం ఇన్నొవా కారు, ఆవెనక నాలుగుయిన స్కార్పియోలు అంటే గుర్తింపు కార్డ అడక్కుండానే శాల్యూట్ కొట్టి లోపలికి పంపించే ఈరోజుల్లో అపుడపుడు రాజ్యంకు గేటు దగ్గిర సమస్యలెదురువుతూ ఉంటాయి. చిన్నబుచ్చకోకుండా ఎమ్మెల్యే ఐడికార్డు చూపించి, నవ్వుకుంటూ లోపలికెళతాడు.

 

ఇలాంటి సున్నం రాజయ్య  బైకు మీద వెళ్తుంటే ఎవరో కొత్త వాడి కంట పడ్డాడు. ఇదేదో వింతగా ఉంది అనుకోని ఫోటోని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.ఈ సత్తెకాలపు కమ్యూనిస్టు మనిషిని  స్ఫూర్తిగా తీసుకునే దెవరు?

 

click me!