ఇది మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు - కల్వకుంట్ల కవిత..

By Sairam Indur  |  First Published Mar 26, 2024, 4:39 PM IST

బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. తనను కావాలనే తప్పుడు కేసులో ఇరికించారని అన్నారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెప్పారు.


తనపై నమోదైనది మనీలాండరింగ్ కేసు కాదని, రాజకీయ లాండరింగ్ కేసు అని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని, ఈ విషయంలో న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ప్రస్తుతం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కస్టడీలో ఉన్న కవితను కస్టడీ ముగియడంతో మంగళవారం రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ పార్టీలో వస్తే స్వాగతిస్తాం - కాంగ్రెస్..

Latest Videos

undefined

అయితే కోర్టులోకి ప్రవేశించే ముందు ఆమె అక్కడ ఉన్న మీడియాతో ప్రతినిదులతో మాట్లాడారు. తనపై ఉన్న కేసు కల్పితమని, అవాస్తవమని అన్నారు. తనను తాత్కాలికంగా జైలులో ఉంచవచ్చు కానీ తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేరని ఆమె బీజేపీ విరుచుకుపడ్డారు. తాను అప్రూవర్ గా మారే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు.

Special Court Remanded daughter of X on remand till April 9,she will be sent to . pic.twitter.com/l3WnsiHOee

— R V K Rao_TNIE (@RVKRao2)

‘‘ఇది మనీలాండరింగ్ కేసు కాదు.. పొలిటికల్ లాండరింగ్ కేసు. ఓ నిందితుడు బీజేపీలో చేరాడు. రెండో నిందితుడికి బీజేపీ టికెట్ లభించింది. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్లలో బీజేపీకి రూ .50 కోట్లు ఇచ్చాడు. నేను ముత్యంలా క్లీన్ గా బయటకు వస్తాను’’ అని ఆమె ప్రకటించారు.

విడిపోయిన భారత్-పాక్ లెస్బియన్ జంట.. పెళ్లికి కొన్ని వారాల ముందు నిర్ణయం..

కాగా.. ఈ నెల 15వ తేదీన కల్వకుంట్ల కవితను హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ అరెస్టు చేసింది. అంతకు ముందు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించింది. ఆమెను అరెస్ట్ చేసిన తరువాత ఈడీ.. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టింది. దీంతో మొదట ఆరు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత మరో మూడు రోజుల పాటు అంటే ఈ నెల 26 (మంగళవారం) వరకు రిమాండ్ పొడిగించారు. తాజాగా ఆమెను కోర్టులో హాజరుపర్చగా కోర్టు ఏప్రిల్ 9 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది.

click me!