ఢిల్లీ లిక్కర్ స్కాం:ఏప్రిల్ 9 వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్

By narsimha lode  |  First Published Mar 26, 2024, 1:09 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో  కల్వకుంట్ల కవితకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. 



హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో  అరెస్టైన  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు  ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ వరకు  జ్యుడిషీయల్ రిమాండ్ విధించింది కోర్టు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో  ఈ నెల  15న కల్వకుంట్ల కవితను  ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.హైద్రాబాద్ నుండి న్యూఢిల్లీకి అదే రోజున కవితను ఈడీ అధికారులు తీసుకు వచ్చారు.ఈ నెల  16న  ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ  కోర్టులో హాజరుపర్చారు. అయితే  కవితను కస్టడీలోకి తీసుకోవాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు

. ఈడీ అధికారుల పిటిషన్ ను  కోర్టు పరిగణనలోకి తీసుకొంది. వారం రోజుల పాటు  తొలుత కస్టడీకి ఇచ్చింది. ఆ తర్వాత మరో ఐదు రోజుల పాటు కస్టడీని కోరారు.అయితే  ఐదు రోజులకు బదులుగా మూడు రోజులు మాత్రమే కవితను కస్టడీకి ఇచ్చింది కోర్టు. కస్టడీ ముగియడంతో ఇవాళ  రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపర్చారు. కవితను కస్టడీకి ఇవ్వాలని  ఈడీ అధికారులు కోరారు.

Latest Videos

undefined

అయితే కవిత పిల్లలకు పరీక్షలు ఉన్నందున ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత కవితకు ఏప్రిల్  9వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ  కోర్టు ఆదేశించింది.కోర్టు ఆదేశాల మేరకు  కవితను ఇవాళ  తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే  కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్  1వ తేదీన విచారణ నిర్వహించనున్నట్టుగా  కోర్టు తెలిపింది.

మరో వైపు ఇదే కేసులో  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడ  ఈడీ అధికారులు ఈ నెల  21న  అరెస్ట్ చేశారు. కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ అధికారుల కస్టడీలో ఉన్నారు. అరవింద్ కేజ్రీవాల్ పై  ఢిల్లీ లిక్కర్ స్కాంపై  ఈడీ అధికారులు అభియోగాలు మోపారు.

 

click me!