పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన మోస్ట్ వాంటెడ్ జాబితాను ఎన్ఐఏ విడుదల చేసింది.ఈ జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురి పేర్లున్నాయి.
హైదరాబాద్: పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కేసుకు సంబంధించి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. ఈ కేసులో పలువురు నిందితుల కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ముగ్గురు కూడ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జారీ చేసిన లుకౌట్ నోటీసులో ముగ్గురి పేర్లున్నాయి. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారి ఇద్దరి పేర్లున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒకరి పేరుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం మండలం జమీలా మహార్ కు చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్ పేరుంది. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ఇస్లాంపూర్ కు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్ జిల్లా ముజాహెద్ నగర్ కు చెందిన ఎండీ అబ్దుల్ అహ్మద్ లను మోస్ట్ వాంటెడ్‌గా ఎన్ఐఏ ప్రకటించింది.
undefined
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కేరళలో 11 మంది, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఐదుగురి చొప్పున మోస్ట్ వాంటెడ్ వ్యక్తులున్నారని ఎన్ఐఏ తెలిపింది.
యువతను పీఎఫ్ఐలో రిక్రూట్ మెంట్ చేయడంలో కీలకంగా వ్యవహరించినట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. భారతదేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా వీరు వ్యవహరించారని ఎన్ఐఏ ఆరోపణలు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మక జిహాద్ చేయడానికి ప్రేరేపిస్తున్నారని ఎన్ఐఏ తెలిపింది. ఈ నిందితుల సమాచారం తెలిస్తే 9497715294 కు సమాచారం ఇవ్వాలని ఎన్ఐఏ అధికారులు కోరారు.
తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పీఎఫ్ఐ మూలాలను పోలీసులు తొలుత గుర్తించారు. సిమీ అనుబంధ సంస్థగా ఉన్న పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ ను 2022 జూలై 6న పోలీసులు అరెస్ట్ చేశారు.
also read:నిజామాబాద్ లో ఉగ్రలింకుల కలకలం: పీఎఫ్ఐ ట్రైనర్ ఖాదర్ అరెస్ట్
యువతకు ఆత్మరక్షణలో శిక్షణ పేరుతో ఉగ్రవాదం వైపునకు తరలిస్తున్నాడని పోలీసులు గుర్తించారు . ఖాదర్ ను అరెస్ట్ చేసి విచారించిన సమయంలో పీఎఫ్ఐ అంశం వెలుగు చూసింది.ఈ కేసు దర్యాప్తునకు సిట్ ను కూడ ఏర్పాటు చేశారు. మరో వైపు దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ మూలాలు వెలుగు చూశాయి. దరిమిలా దేశ వ్యాప్తంగా పీఎఫ్ఐ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది.ఈ సోదాల్లో కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులు సేకరించారు.