సిరిసిల్ల జిల్లా, బోయిన్‌పల్లి మండలం వెంకట్రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన క్యూ లైన్‌లో నిల్చున్న మూడో తరగతి విద్యార్థి బుర్ర కౌశిక్ (8) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు.
రాజన్న సిరిసిల్ల : దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుని తెల్లారి పాఠశాలకు వెళ్లిన ఓ చిన్నారి గుండె అకస్మాత్తుగా ఆగింది. అప్పటిదాకా తోటి విద్యార్థులతో ఆడిపాడిన బాలుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోయి, కన్నుమూశాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకట్రావుపల్లిలో మంగళవారం చోటు చేసుకుంది. వెంకట్రావు పల్లికి చెందిన బుర్ర కుషిత-సతీష్ దంపతులకు కొడుకు కౌశిక్ (9), కుమార్తె మేఘన ఉన్నారు. కాగా, బోయిన్‌పల్లి మండలం వెంకట్రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన క్యూ లైన్‌లో నిల్చున్న మూడో తరగతి విద్యార్థి బుర్ర కౌశిక్ (8) మంగళవారం గుండెపోటుతో మృతి చెందాడు.
కౌశిక్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో క్యూలైన్లో నిలిచి ఉన్న కౌశిక్ హఠాత్తుగా కిందపడిపోయాడు. అది గమనించిన ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే ఉపాధ్యాయులు వాహనంలోని కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి కౌశిక్ అప్పటికే గుండెపోటుతో మరణించాడని తెలిపారు. కొంతకాలంగా ఫిట్స్, గుండె సంబంధిత (హార్ట్ వీక్) వ్యాధితో చిన్నారి బాధ పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కౌశిక్ మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.
మంచిర్యాలలో బెజ్జంకి ఎస్ఐ వీరంగం: స్నేహితులతో కలిసి స్థానికులపై దాడి